Home / health / మీ ఇంట్లో అల్యూమినియం పాత్రల్లో వండుతున్నారా! మీ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్టే…!

మీ ఇంట్లో అల్యూమినియం పాత్రల్లో వండుతున్నారా! మీ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్టే…!

Author:

పూర్వపు రోజులలో మరియు ఇప్పుడు ఊరిలో ఉండే ముసలివారు ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజులలో వారు తీసుకున్న కల్తీలేని ఆహారం, కాలుష్యం లేని వాతావరణం. ఆ రోజుల్లో ఆహారం మట్టి పాత్రల్లో వండేవారు. దానితో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండేది. కాలం మారుతున్న సమయంలో అన్నిట్లో మార్పులు చేసుకున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం కల్తీ కాకూడదు. మరి ఈ రోజుల్లో ఆహారం వండే సమయంలోనే కల్తీ అవుతుందని మీకు తెలుసా!… అవును ఇది నిజం. ఈ రోజులల్లో వంటిల్లలో అందరూ ఎక్కువగా అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు…. ఇలా అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకొని తినడం వలన మనుషులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతోపాటు ఇంకా చాలా రోగాలు వచ్చె అవకాశం ఉన్నదని కెనడాకు చెందిన ఒక యూనివర్సిటి వారి పరిశొధనలో తేలింది.

aluminum-kitchen

యూనివర్సిటి వారి అధ్యయనం ప్రకారం అల్యూమినియం పాత్రల్లో వండటం వలన పాత్రలు వేడి అయి కరిగి ప్రతి వంటతో పాటు మన శరీరంలోకి 1 నుండి 2 గ్రాముల అల్యూమినియం చేరుతుంది. ఎసిడిక్ పదార్దాలు అయిన టొమాతో లాంటివి వండితే ఈ శాతం 5 గ్రాములకు చేరుతుంది. ప్రతి మనిషి రోజుకు 30 నుండి 50 గ్రాముల అల్యూమినియం తీసుకొవచ్చు కాని మనం త్రాగే నీరు మరియు ఇతర పదార్దాలో కూడా చాలా అల్యూమినియం ఉంటుంది. చివరికి వంట గిన్నెలలో ఉండే అల్యూమినియం కూడ మన వంటిలోకి చేరుతుండడంతో శరీరానికి అవసరమైన దాని కన్న ఎక్కువ శాతం అల్యూమినియం మన శరీరంలోకి చేరి చాలా రోగాలకు పరోక్ష కారకముగా తయారు అవుతుండి. అల్యూమినియం ఎక్కువ తీసుకోవడం వలన మెదడుకు సంబందించిన వ్యాధులతో పాటు అల్జీమర్స్ వ్యాధి వచ్చె అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుండి అయిన అల్యూమినియం వంట పాత్రల వాడకాన్ని తగ్గించండి లేదా ఐయోనైజేషన్ చేసిన అల్యూమినియం పాత్రలు వాడండి.

Also Read: దేవుడికి టెంకాయనే ఎందుకు కొడతారో తెలుసా..?

(Visited 4,457 times, 1 visits today)