Home / health / నెయ్యి వలన శిరోజాలకు కలిగే మేలు

నెయ్యి వలన శిరోజాలకు కలిగే మేలు

Author:

బట్టతల కనీసం కలలో వచ్చినా భయంగానే ఉంటుంది. తలలో నుండి ఒక్కొక్క వెంట్రుక రాలుతూంటే ఒక్కోప్రాణం పోయినట్టుగానే ఉంటుంది. బట్టతల వల్ల ఎంతోమంది ఆత్మవిశ్వాసం కోల్పోయి తమ కెరీర్ లోనూ వెనుకబడుతున్నారట. మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఈ కాలుష్యానికి రాలిపోతున్న జుట్టును చూసుకోని భాదపడుతూంటాం. ఇప్పుడు దాదాపుగా మనలో సగం మంది భాద ఇదే. ఏవేవో మందులూ, షాంపూలూ, డాక్టర్ల సలహాలూ ఇలా ఎన్నొ రకాలుగా రాలిపోయే జుట్టుని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉండి ఉంటారు కదా… అయితే మీకో విషయం తెలుసా..? మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే నెయ్యి వల్ల మన శిరోజాలకు చాలా లాభం చేకూరుతుంది. నెయ్యిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

amazing-health-benefits-with-ghee-for-hair

  • నాణ్యమైన దేశీయ నెయ్యి జుట్టుకు మంచి కండిషనర్‌గా పని చేస్తుంది. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ నూనెతో కలిపి తల వెంట్రుకలకు రాసిన తర్వాత 20 నిమిషాల దాకా అలానే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
  • వెంట్రుకల చివరలు రెండుగా చిట్లిపోతున్నట్లైతే.. ఆ సమస్య నుంచి విముక్తి పొందాలని మీ వెంట్రుకలని కత్తిరించుకోనవసరం లేదు నెయ్యితోనే దీనికి చెక్ పెట్టవచ్చు. మూడు చెంచాల నెయ్యి తీసుకొని వెంట్రుకల చివర్లో రాసి 15 నిమిషాల తర్వాత తల దువ్వుకొని, మైల్డ్‌షాంపూతో కడిగేస్తే సరిపోతుంది.
  • పొడి జుట్టు.. పొడి చర్మం ఉండి చుండ్రు సమస్యతో బాధ పడేవారు నెయ్యి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు సౌందర్య నిపుణులు. గోరువెచ్చని నెయ్యి, బాదం నూనె కలిపి వెంట్రుకల మొదళ్లలో రాసి 15నిమిషాల పాటు ఉంచి నెయ్యి పోయేలా రోజ్ వాటర్‌తో వెంట్రుకలని కడిగేయాలి.

నెలకు రెండుసార్లు పైవిధంగా చేస్తే మంచి ఫలితం అని అంటున్నారు నిపుణులు. పొడి చర్మం.. ఆయిలీ స్కిన్ ఇలా రెండు రకాల చర్మ గుణాలు కల్గిన వారు ఒకట్రెండు సార్లు వాడినా.. ఫలితం లేదనుకునేవాళ్లు దీనిని వాడకపోవడం మంచిది.

(Visited 2,684 times, 1 visits today)