Home / Entertainment / ముంబై నగరం నడిబొడ్డున ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ ను వెంటాడిన పెద్ద పులి.

ముంబై నగరం నడిబొడ్డున ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ ను వెంటాడిన పెద్ద పులి.

Author:

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు సాహసాలు కొత్తేమీ కాదు..సాహసాలు చేసేముందు ఆయన తన వయసును కూడా పట్టించుకోరు…. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఒక పెద్ద పులి ఆయన్ను వెంటాడుతుంటే….చాలా నింపాదిగా ఎలా కారులో నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారో చూశారుగా! ఆయన నిజానికి మాహారాష్ట్ర ప్రభుత్వానికి పులుల రాయబారి. బహుశా ఆ విషయం తెలిసే ఏమో, ఆ పెద్ద పులి కూడా తమ జాతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ ను గౌరవిస్తూ, ఒక గంట సమయం ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్నే అనుసరించింది. దానిపైనే ఆయన ఒక భిన్నమైన ట్వీట్ చేశారు.

amithab bachhan thrilled by tiger

ముంబై మహానగరం నడిబొడ్డున ఇలా పెద్ద పులి వెంట నడుస్తుంటే, ముందు వెళ్ళడం చాలా ధ్రిల్లింగ్ గా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. బిగ్ బీ గురించి ఆ నోటా ..ఈ నోటా వినటమే కానీ…ఇలా దగ్గర్నుంచి చూడడం మొత్తానికి పెద్ద పులికి కూడా సరదాగా అనిపించి ఉండవచ్చు గదా..ఎవరైనా పులి భాష తెలిసిన వారుంటే, అదే విషయాన్ని అమితాబ్ కు కన్వే చేస్తే..ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ప్రస్తుతం అమితాబ్-పెద్దపులి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా నడుస్తున్నాయి.

(Visited 94 times, 1 visits today)