Home / Entertainment / ‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ ను ప్రశంసించిన అమితాబ్ బచ్చన్.

‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ ను ప్రశంసించిన అమితాబ్ బచ్చన్.

Author:

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’. జనవరి 1న విడుదల కానున్న నేపధ్యంలో వర్మ ఈ చిత్ర ప్రమోషన్ వేగాన్ని కూడా పెంచారు. ఇటివల ఈ చిత్రం యొక్క టీజర్ ను తిలకించిన బాలివుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ  “చాల రియలిస్టిక్ గా, ఆశ్చర్యకితులను చేసే విదంగా కిల్లింగ్ వీరప్పన్ ఉందంటూ” ట్విట్టర్ ద్వారా వర్మని ప్రశంసించారు.

దానికి వర్మ ప్రతిస్పందిస్తూ “తొలిసారిగా అమితాబ్ గారు ఒక తెలుగు సినిమా ట్రైలర్ గురించి ట్విట్ చేశారు. సహజత్వానికి దగ్గరగా ఉందే చిత్రాలు, రా సినిమాలు తీయడంలో నేను ది బెస్ట్ అని అమిత్ జీ అభిప్రాయం. ప్రచార చిత్రాల్లో తీవ్రమైన భవోద్వేగాలు,అసాధరణమైన చిత్రీకరణ అయనకు నచిందనుకుంట” అని అభిప్రాయాన్ని తెలియజేశాడు.

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితంలో కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వర్మ తెలిపాడు. వీరప్పన్ ని పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సమయాన్ని, ఖర్చును వృధా చేసిందో కూడా ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాడు. ఆపరేషన్ కుకున్ కోసం వీరప్పన్ అనుచరులతో పాటు, అతని భార్య ముత్తు లక్ష్మి వద్ద వర్మ చాలా విషయాలు తెలుసుకొని చిత్రాన్ని తెరకెక్కించాడు.

(Visited 106 times, 1 visits today)