Home / Inspiring Stories / రైల్లో పాటలు పాడి డబ్బులు వసూలు చేసిన అమితాబ్

రైల్లో పాటలు పాడి డబ్బులు వసూలు చేసిన అమితాబ్

Author:

amitabh bachchan singing in train

విక్టోరియా టెర్మినస్ నుంచి భందుప్ స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించిన ప్రయాణికులలో కొంత మంది తాము చూస్తున్నది కలో నిజమో అర్థం కానంతగా ఆశ్చర్య పోయారు.ఒక్క సారిగా పిచ్చి ఆనందం తో గంతులేసారు కూడా. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ లోకల్ ట్రైన్లో కనిపించి పలకరిస్తే ఎవరు మాత్రం పై రియాక్షన్లివ్వరు చెప్పండి..!? అసలు అమితాబ్ లోకల్ ట్రైన్ లో ఎందుకెక్కాడు,సినిమా షూటింగా అనుకొని చుట్టూ చూసారు కూడా కెమెరాల కోసం కానీ అలాంటివేమీ కనిపించలేదు. కొందరు ధైర్యం చేసి పలకరించించి “సర్ కార్ ప్రాబ్లొమా? అని అడిగారట కూడా. అమితాబ్ చెప్పిన సమధానం విని ఆశ్చర్య పోయారట కూడా ఇంతకీ ఆయనన్నదేమిటంటే…”నేను పాట పాడతాను నాక్కొన్ని డబ్బులిస్తారా..?” అని. మీరు చదివింది నిజమే బాలీవుడ్ సుల్తాన్ అమితాబ్ పాటలు పాడి డబ్బులు అడగటంకోసమే రైలెక్కాడు.

16amitabh-in-train1

amitabh bachchan local train 1

ఇంతకీ అసలు విశయమేమిటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా కేన్సర్ రోగులకు చికిత్స చేయించేందుకు డబ్బులు సేకరించడానికి సదరు రైల్లో పాటలు పాడారు. తాను స్వయంగా పాడిన సిల్ సిలా చిత్రంలోని ‘రంగ్ బర్ సే భీగే చునర్ వాలీ రంగ్ బర్ సే’ లాంటి పాటలతో ప్రయాణికులను అలరించటమే కాదు వారితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని డబ్బులు సేకరించి వితరణ కార్యక్రమాలకు అందించే సౌరభక్ నింబ్కర్ తో కలిసి అమితాబ్ పాటలు పాడారు.ఇదంతా చేసింది మీడియా ప్రచారం కోసం కూడా కాదనీ ఇలాంటి మంచి పని చేస్తున్న సౌరబక్ తనను ఇన్స్పైర్ చేసాడనీ,అందుకే తానూ లాంటి వాళ్ళకు కాస్త సాయం చేయాలన్న ఉద్దేశ్శ్యం తోనే తానూ ఇలా వచ్చాననీ తన బ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. రోజూ రైళ్ళలో తిరుగుతూ పాటలు పాడి నిధులు సేకరిస్తూ క్యాన్సర్ పిల్లలకోసం కృషి చేసే సౌరభక్ నింబ్కర్, అతడి కృషి అభినందనీయమని అమితాబ్ తెలిపారు. కాగా, సౌరభక్ కు కూడా ముందుగా చెప్పకుండా అమితాబ్ అక్కడకు వెళ్లి పాటలు పాడటంతో అతడు కూడా ఆశ్చర్యపోయాడట. తన ప్రయత్నం అమితాబ్ ని కదిలించటం గర్వంగా ఉందని అన్నాడట. మొత్తానికి ఆ పూట విక్టోరియా టెర్మినస్ నుంచి భందుప్ స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించిన వారికి అమితాబ్ తో ఒక అందమైన ఙ్ఞాపకం మిగులుతుందీ,క్యాన్సర్ పిల్లలకు కొంత డబ్బూ అందుతుంది. మన హీరోలూ అప్పుడప్పుడు డబ్బు సహాయాలే కాకుండా ఇలా ఇంకొందరికి సహాయ పడటం మంచిదేమో.

(Visited 95 times, 1 visits today)