Home / Entertainment / యాంకర్ కాస్తా ‘క్షణం’లో పోలీస్ ఆఫీసర్ మారిపోయింది.

యాంకర్ కాస్తా ‘క్షణం’లో పోలీస్ ఆఫీసర్ మారిపోయింది.

Author:

Anasuya new movie

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. చాలా తక్కువ టైంలో క్రేజ్ తెచ్చుకున్న అనసూయకు భారీగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు ఐటం సాంగ్స్ కావడంతో వాటిని రిజెక్ట్ చేసింది. అనసూయ ముందు న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, ఆ తర్వాత సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతుంది.

అనసూయ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది ఇటీవలే నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు తెరపై కనిపించింది కాసేపే అయిన అభిమానులకు మాత్రం కనువిందు చేసింది.ఇక ఈ చిత్రంతో అనసూయ మరో సినిమా అవకాశాన్ని కొట్టేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవిపీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘క్షణం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. అడవి శేషు హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాతో… రవికాంత్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ‘క్షణం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

అనసూయకు పెళ్ళి అయ్యింది అంటేనే ఎవరు నమ్మరు అలాంటింది పెళ్ళై బిడ్డల తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్ తో తన మ్యాజికల్ నవ్వుతో బుల్లి తెర ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.తెలుగులో ఉన్న యాంకర్ లలో హాట్ గా కనపడి వెంటనే ఆకట్టుకునే వారు ఎవరంటే కళ్ళు మూసుకుని చెప్పే పేరు అనసూయ. ఇలాంటి ఆఫర్స్ ఇంక రావలని మంచి హీరోయిన్ కావలని కోరుకుంటు ఆల్ ది బెస్ట్ అనసూయ ….

(Visited 110 times, 1 visits today)