Home / Entertainment / ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిన అనుసూయ

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిన అనుసూయ

Author:

anasuya

మొదట్లో  జబర్ధస్త్ అంటు ప్రతి గురువారం రాత్రి 9:30ని, వచ్చి ప్రేక్షకులకు తన జబర్ధస్త్ అందాలతో మస్త్ గా అలారించిన అందల ముద్దుగుమ్మ అనసూయ, హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోనీ రేంజి లో అమ్మడు పాపులర్ అయ్యింది. తర్వాత జబర్దస్త్ ని విడిచిపోయిన ఆమె పాపులారిటి మాత్రం పెరుగుతూనే పోతుంది. ప్రస్తుతం నాగార్జున సరసన మరదల్ గా ‘సోగ్గాడే చిన్ని నాయనా ‘ మూవీ లో నటిస్తూ అనసూయ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది… పెళ్లి అయి 5 ఏళ్ళు గడిచిన కానీ అమ్మడి అందం చెక్కుచెదరలేదు..తాజాగా ఈ భామ తన ప్రేమ, పెళ్లి విషయం గురించి మీడియాతో పంచుకుంది..

అనసూయ మాట్లాడుతూ… నేను 9 సంవత్సరాలు వనవాసం చేశాను అంటుంది. ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తి కోసం అంటుంది. ఆమె ఇంటర్ పూర్తయ్యే టైం లో ఎన్ సీ సీ క్యాంపులో కమాండర్ గా జాయిన్ అయ్యింది.. అప్పుడు క్యాంపులో సుశాంత్ బరద్వాజ్(అనసూయ భర్త) వచ్చి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె కూడా అబ్బాయిని చూడగానే నచ్చాడని ఈ విషయం ఇంట్లో చెప్తే అతని ఫోటో చూసి అమ్మ కూడా ఒకే చెప్పిందని చెప్పుకొచ్చింది. అలా దాదాపుగా ఏడాది తర్వాత మళ్ళీ కలుసుకున్నపుడు తనకి మాటీవీలో యాంకర్ గా అవకాశం వచ్చిందని అతనితో చెబితే నువ్వు అలాంటివి చేయడం తనకి ఇష్టంలేదని చెప్పాడు అన్నది. వీళ్ళ పెళ్ళికి అనసూయ నాన్న ఒప్పుకోకపోవడం ఇంట్లో నుండి బయటికి వచ్చి హాస్టల్ లో ఉన్నానని అలా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తననే ప్రేమిస్తున్న సుశాంత్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యీ 2010లో సుశాంత్ ని పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తన భర్త అనుమతితోనే ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నానని అనసూయ తన ఆలనాటి ప్రేమ జ్ఞాపకాలను పంచుకుంది..

(Visited 320 times, 1 visits today)