Home / Entertainment / త్రివిక్రమ్,నితిన్ ల న్యూ ఇయర్ ఓ స్పెషల్ గిఫ్ట్.

త్రివిక్రమ్,నితిన్ ల న్యూ ఇయర్ ఓ స్పెషల్ గిఫ్ట్.

Author:

Anasuya ramalingam and Anand Vihari First look

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ హీరో నితిన్ లు కలిసి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అ..ఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక. నితిన్ సరసన అందాల భామ సమంతతో పాటు తమిళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

అక్టోబర్ లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70%పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది, అలాగే సినిమాని జనవరికల్లా ఫినిష్ చేసి ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్న ఈ చిత్ర టీం న్యూ ఇయర్ కానుకగా ఓ స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు.ఈ చిత్ర టీం అనౌన్స్ చేసిన దాని ప్రకారం.. త్రివిక్రమ్ అండ్ టీం ‘అ.. ఆ’ సినిమా టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ ని ఈ రోజు సాయంత్రమే రిలీజ్ చేశారు.

(Visited 64 times, 1 visits today)