Home / Videos / Video: డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ప్రదీప్ చెప్పిన వీడియో వైరల్..!

Video: డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ప్రదీప్ చెప్పిన వీడియో వైరల్..!

Author:

న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 ఉదయం వరకు చేపట్టిన స్పెషల్ డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో దాదాపు 2000 మంది దాకా ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు, వారిలో బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మచిరాజు ఉండటం సంచలనం సృష్టించింది, మాములుగా డ్రింక్ అండ్ డ్రైవ్ లో 35 పాయింట్స్ దాటితే కేసు నమోదు చేస్తారు.. ప్రదీప్ కి ఏకంగా 178 పాయింట్స్ రావడం మరింత సంచలనం సృష్టించింది. అయితే కొన్ని నెలల క్రితం యాంకర్ ప్రదీప్ డ్రింక్ అండ్ డ్రైవ్ కి వ్యతిరేకంగా ప్రచారంలో కూడా పాల్గొన్నాడు, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో “చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ” పేరుతో వైరల్ గా మారింది, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని నీతులు చెప్పిన ప్రదీప్ యే ఏవిధంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసాడని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసుకుంటూ టాలెంట్ తో స్టార్ యాంకర్ గా మారిన ప్రదీప్ కి అభిమానులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా యూత్ ఫ్యాన్స్ ప్రదీప్ కి ఎక్కువమంది ఉన్నారు, వాళ్లంతా ప్రదీప్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు, న్యూస్ చానెల్స్ అన్ని ఏ సమస్యలు లేనట్లు ప్రదీప్ నే టార్గెట్ చేశాయని, తప్పులు అందరు చేస్తారని.. వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాఖ్యానిస్తున్నారు.

(Visited 157 times, 1 visits today)