Home / Reviews / అంధగాడు రివ్యూ & రేటింగ్.

అంధగాడు రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

2.5/5.0

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్ర ప్రసాద్‌, షాయాజీషిండే, సత్య, తదితరులు.

Directed by: వెలిగొండ శ్రీనివాస్‌

Produced by: సుంకర రామబ్రహ్మం

Banner: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: శేఖర్‌ చంద్ర

లవర్ బాయ్ ఇమేజ్ బయటపడేందుకు కొత్త కొత్త కథలను ట్రై చేస్తున్నాడు రాజ్‌తరుణ్‌. ఈ నేపధ్యంలో వచ్చిందే కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఆ సినిమా విజయం సాధించిన తరువాత కొత్త దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్‌ చెప్పిన కథ నచ్చడంతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  అంధగాడు సినిమాకు ఒప్పుకున్నాడు. కథ మీద నమ్మకంతో గుడ్డివాడిగా కూడా నటించేందుకు వెనకాడకుండా రాజ్‌తరుణ్‌ నటించిన సినిమా అంధగాడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో చదవండి.

కథ:

పుట్టుకతోనే అంధుడైన గౌతమ్‌ (రాజ్‌ తరుణ్‌) ఒక ఓ అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. రేడియో జాకీ గా పనిచేసే గౌతమ్‌ కి నేత్ర (హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. కంటి డాక్టర్ అయిన నేత్ర సహకారంతో గౌతమ్‌ కి చూపు వస్తుంది. చూపు వచ్చాక గౌతమ్‌ కి కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్‌) అనే ఆత్మ నుండి సమస్యలు ఎదురవుతాయి.  రెండు హత్యలు చేస్తేనే గౌతమ్‌ ని వీడిపోతానని చెపుతుంది ఆ ఆత్మ. అసలు ఆ ఆత్మ ఎందుకు గౌతమ్‌ ని పట్టుకుంది? ఆత్మ చంపమన్నది ఎవరిని? దానికి గౌతమ్‌ ఒప్పుకున్నాడా? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

మనుషుల సాయంతో ఆత్మలు తమ తీరని కోరికలను, పగలను తీర్చుకునే ఇతివృత్తంలో చాలా సినిమాలు వచ్చాయి. అదే జొనెర్ కి కొంచెం కామెడీని యాడ్ చేసి హర్రర్ కామేడీతో రివెంజ్ తీర్చుకునే స్టోరీనే ఈ అంధగాడు. అయితే అన్ని సినిమాలాగా మొదటి నుండి సస్పెన్స్ క్రియేట్ చేయకుండా వేరే రూట్లో కథ ను నడిపించాడు దర్శకుడు. మొదటి అర్ధ భాగంలో అసలు కథను టచ్ చేయకుండా కేవలం పాత్రలను పరిచయం చేస్తూ ఇంటర్వల్ సమయానికి హీరో, హీరోయిన్ల ప్రేమ ఒక కొల్లిక్కి వచ్చేలా చేసాడు. మొదటి అర్ధ భాగం కామేడీతో, హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేషాలతో ఆకట్టుకుంటుంది. అయితే అసలు కథ రెండో అర్ధ భాగంలోనే మొదలవుతుంది. అన్ని సినిమాలలో లాగా ఆత్మ ఇంకోకరి శరీరంలోకి ప్రవేశించి పగ తీర్చుకునే విధంగా కాకుండా హీరో ఒక్కడి కనులకే కనపడి అతనితో తనకు కావాల్సిన పనులు చేయించుకునేల తీర్చిదిద్దిన కులకర్ణి పాత్ర రెండవ భాగంలో ఆకట్టుకుంటుంది. రెండవ భాగంలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయిన ఆత్మ, సస్పెన్స్ మరియు క్లైమాక్స్ లు ప్రేక్షకులని అలరిస్తాయి.

నటీనటుల పనితీరు:

రాజ్‌తరుణ్‌: ఇప్పుడున్న పరిస్తితుల్లో అంధుడిగా నటించమంటే మన హీరోలు ఎవరు ముందు రాకపోవచ్చు కాని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కథ మీద నమ్మకం తో రాజ్ తరుణ్ తన బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ని ఈ సినిమాలో ఇచ్చాడు. కళ్ళు కనిపించనప్పుడు ఒకలాగా, కళ్ళు తిరిగి వచ్చాకా పూర్తి డిఫెరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.

హెబ్బా పటేల్‌: ఇంతకుముందు సినిమాల కన ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ ఇంకాస్తా అందంగా, మెచ్యూర్డ్ గా కనపడుతుంది. మొదటి అర్ధ భాగంలో ఎక్కువ సేపు కనపడిన హెబ్బాకు సెకండ్ హాఫ్ లో అసలు నటించే అవకాశం రాలేదు.

రాజేంద్ర ప్రసాద్‌: తనకు కావాల్సింది సాధించుకునే ఆత్మ కులకర్ణిగా మంచి నటన కనబర్చారు రాజేంద్ర ప్రసాద్‌. షాయాజీషిండే, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • రాజ్‌తరుణ్‌ న‌ట‌న‌
  • కథ, దర్శకత్వం
  • థ్రిల్లింగ్ సెకండ్ హాఫ్
  • కామెడి.

మైనస్ పాయింట్స్:

  • సంగీతం, పాటలు
  • కొన్ని చోట్ల బోర్ కొట్టించే సన్నివేషాలు.
(Visited 1,271 times, 1 visits today)