Home / Inspiring Stories / అమరావతి కోసం అండర్ వాటర్ రహదారి.

అమరావతి కోసం అండర్ వాటర్ రహదారి.

Author:

ఆంధ్ర ప్రదేశ్ మరో సింగపూర్ గా మారుతుందీ అంటూ ప్రకటించిన చంద్రబాబు కొత్త రాజధాని ని సింగపూర్ జిరాక్స్ లా తయారు చేసే పనిలో పడ్డారు. ఐతే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని మాత్రమే కాదు పూర్తి రాష్ట్రాన్ని కూడా ఆయన కొత్త హంగులతో నిర్మించాలని చూస్తున్నాట్టున్నారు. దానిలో భాగం గానే రాష్ట్రంలో ఎక్కడికైనా గంటల్లో చేరుకునేలా విశాలమైన ఎక్స్‌ప్రెస్‌ హైవేలు! అమరావతిలో అయితే ఏకంగా ఎనిమిది, పది వరుసల విశాల రహదారులు! కృష్ణా నదికి అటూఇటూ అత్యాధునిక వంతెనలు! అమరావతిని అత్యాధునిక రవాణా సాధనాలతో అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Amaravithi City Plan

ఐతే ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన చేసిన చంద్రబాబు అందర్నీ ఒక ఆశ్చర్యానికి గురి చేసారు. అదేమిటో తెలుసా కృష్ణానదిలో అండర్ వాటర్ టెన్నెల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.దీని ప్రకారం ఎపి కొత్తరాజధాని ప్రాంతం నుంచి కృష్ణ నదిలో గుండా ఐదు కిలోమీటర్ల పొడవైన అండర్ టెన్నెల్ నిర్మించాలనుకుంటున్నారట. కృష్ణా నదిలో రాజధాని వైపు నుంచి విజయవాడ వరకూ ఈ టన్నెల్‌ను నిర్మించనున్నారు. ఈ టన్నెల్ గుండా వాహనాల రాకపోకలకు అనుమతించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు నది మధ్యలో నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లే ప్రత్యేక అనుభూతిని కల్పించేందుకు దీన్ని ప్రతిపాదించారు. అండర్‌ వాటర్‌ టన్నెల్‌ పాసేజ్‌! ప్రపంచంలోనే అతి కొద్ది దేశాలకు మాత్రమే పరిమితమైన ‘అండర్‌ వాటర్‌ పాసేజ్‌’ను అమరావతిలో ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీనిని నదికి ఒకవైపున ఉన్న సీడ్‌ కేపిటల్‌కు చేరువగా ప్రారంభించి, కృష్ణానది అంతర్భాగం గుండా నదికి మరోవైపున, కృష్ణా జిల్లాలోని సూరాయిపాలెం లేదా ఇబ్రహీంపట్నం వరకు నిర్మించి, దానిని అక్కడికి సమీపంలోని హైదరాబాద్‌ వెళ్లే హైవేకు కలపాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమయ్యే ఈ రహదారి అమరావతికి అఖండ కీర్తిప్రఖ్యాతులు సముపార్జించి పెడుతుందని, ఎక్కడెక్కడి సందర్శకులకూ తప్పక చూడదగిన ప్రదేశంగా వెలుగొందుతుందని, తద్వారా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెంది, తరతరాలపాటు భారీ ఆదాయం కూడా సమకూరుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానికి సమీపంలో కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన కొత్త వంతెనల్లో ఒకదాని స్థానంలో ఈ భూగర్భ ప్రయాణ మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా సింగపూర్‌ నిపుణులను కోరినట్లు సమాచారం. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ ని కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.

Under Water Tunnel in Amaravathi

రాజధాని లోనూ చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ మరికొన్ని ఆకర్షనలను ఏర్పాటు చేసి చక్కటి టూరిస్ట్ హబ్ గా కూడా ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగం గానే కృష్ణానదిలో ద్వీపకల్పంలో బోటానిక్ గార్డెన్స్ , లాండ్ స్కేప్ డిజైన్, కొండపల్లి కోటలో కొత్త మార్గాలు మొదలైన టూరిస్టు ఆకర్షణలు ఉండాలని కూడా ప్రతిపాదించారు.ఐతే వీటికి అయ్యే వ్యయం ఎంతో తెలియదు కాని ఇప్పటికైతే అంతా సీరియస్ గానే జరుగుతోంది.

Amaravathi city master plan

ఐతే నదీగర్భంలో రహదారి నిర్మాణం అంటే మామూలు విశయం కాదు, అందుకే ఈ నిర్మాణం లో తలెత్తే సమస్యలతో పాటు ఖర్చు గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అండర్‌ వాటర్‌ పాసేజ్‌ నది మీద కట్టే వంతెనలతో పోల్చితే మరీ ఎక్కువ ఖర్చుతో కూడుకుంటే మాత్రం ఈ ప్రయత్నాన్ని విరమించే ఆలోచనకూడా ఉన్నట్టు తెలుస్తోంది, అలా కాకుండా ఈ రెండింటి వ్యయం మధ్య వ్యత్యాసం కాస్త తక్కువలోనే ఉంటే ఈ కొత్త తరహా నిర్మాణం వల్ల వచ్చే ప్రయోజన,ప్రచారాలను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారి నిర్మాణం లో ముందడుగు వేస్తారట. కాలక్రమంలో అమరావతిని ప్రపంచంలోనే మేటి పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ అండర్‌ వాటర్‌ పాసేజ్‌ గనుక నిర్మితమైతే రాజధాని లో మరో అద్బుతం చేరుతుందనుకుంటున్నారు…

(Visited 1,072 times, 1 visits today)