Home / Entertainment / అంజలి అర డజన్ సినిమాలతో ‘సరదా’గా గడుపుతుంది

అంజలి అర డజన్ సినిమాలతో ‘సరదా’గా గడుపుతుంది

Author:

anjali

తమిళంలో వరుస సినిమాలు చేసిన తర్వాత తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించిన భామ అంజలి.. ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం బడా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇటీవలే ‘శంకరాభరణం’ చిత్రంలో లేడీ డాన్ పాత్రలో నటించిన ఈ భామ ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా అంజలి క్రేజీ సినిమాల ఆఫర్లను దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఒకటి ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజు గారి గది’ సినిమా ఘనవిజయం తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడు. ఈ సీక్వెల్ లో దర్శకుడు ఓంకార్ హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సరైనోడు చిత్రంలో ఒక ఐటెం సాంగ్ లో చేయబోతున్న ఈ భామ మంచు వారి హీరోతో ‘సరదా’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. మరోపక్క మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘పెరనాబు’ అనే చిత్రంలో కూడా అంజలి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ తమిళ చిత్రానికి దర్శకుడు రామ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలో మమ్ముట్టి ఒక పాపకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి మమ్ముట్టికి భార్య పాత్రలో కాకుండా ఒక సెకండ్ లీడ్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తుంది. జనవరి రెండవ వారంలో ఈ సినిమా సెట్స్ పైనకి వెళ్లనుంది. ఇక ఈ ఏడాది దాదాపుగా అర డజన్ సినిమాలతో బిజీబిజీగా గడపనుంది ఈ బొద్దుగుమ్మ.

(Visited 110 times, 1 visits today)