Home / Political / అతితక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తున్న ప్రభుత్వం.

అతితక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తున్న ప్రభుత్వం.

Author:

internet price going cheap in ap

ప్రపంచం ఇప్పుడు మన గుప్పిట్లో అంటూ చెప్పడం కాదు దానిని సద్వినియోగం చేసుకుంటేనే అసలైన ఫలితాలు వస్తాయి. ఈ లక్షం తోనే డిజిటల్ ఇండియాను ప్రాంభించారు మోడి సర్కార్. ఇప్పుడు ఇదే మాటను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తక్కువ రేటుకే ఇంటర్ నెట్ సేవలు అందించేందుకు నిన్న మొదటి ఫైబర్ గిడ్ ప్రాజెక్ట్ ని ప్రాంభించారు.ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఐటి దిగ్గజం సిస్కో మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఫైబర్ నెట్ అనే బ్రాడ్ బ్యాండ్ ఇంత వరకు ఒక రాష్ట్రం మొత్తం కోసం అగ్రిమెంట్ జరగటం దేశంలో ఇదే మొదటిసారి.అది కూడ ఈ సేవలు విశాఖపట్నంలో మొదటగా ప్రారంభిస్తుండటంతో  చాలా ప్రాధన్యత సంతరించుకుంది.

            ప్రతిష్టాత్మమైన ఈ ప్రాజెక్ట్ లో అతి తక్కువ ధరకు ఇంటర్ నెట్ సౌకర్యం లభిస్తుంది. ఈ సేవలు మొదటగా విశాకపట్నం మరియు శ్రీకాకుళం వారికి ఏప్రియల్ నుండి అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన జిల్లాలకు జులై నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వలన ఇంటి వద్ద 15Mbps ఉపయోగించే వారు 149 నెలసరి చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఆఫీసు అవసరమై 100Mbps  ఉపయోగించే వారు 999రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఫైబర్ వైర్స్ ని కరెంట్ స్తంభాల ద్వారా ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకు వెళ్ళనున్నారు.

(Visited 1,368 times, 1 visits today)