మన దేశ మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు మరణించినప్పటికీ అతను చెప్పిన మాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన గొప్పతనం గురించి మాటల్లో వర్ణించటం కష్టం.
ఆయన చెప్పిన మాటలు, స్పూర్తినిచ్చే కథల వల్ల ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిగమించారు. ఆయన మరణానికి ముందు చివరి సారిగా ప్రజలకు చెప్పిన స్పూర్తినిచ్చే కథ ఇది.
తండ్రీకొడుకులు గుడికి వెళ్ళారు, ముఖద్వారంలో ఉన్న స్తంబాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు జడుసుకుంటాడు. భయంతో నాన్నా పరిగెత్తు సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెడతాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబూ… అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్తాడు. ఆ కుర్రాడు బేలగా శిలపరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడూ… అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కాని అప్పటి నుంచి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంబించా…. దేవుడు కనిపించలేదు గాని మానవత్వం కనిపించింది, అని……..!!