Home / General / త్వరలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ తో ఐ ఫోన్ -తగ్గనున్న ధరలు

త్వరలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ తో ఐ ఫోన్ -తగ్గనున్న ధరలు

Author:

ఆపిల్ సంస్థ వారి ఐఫోన్ లకు ప్రపంచ వ్యాప్తంగానే కాక మన దేశంలోనూ ఎంతో ఆదరణ ఉంది.ఆన్ లైన్, ఆఫ్ లైన్ అన్న తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్ లు జరిగి పోతుంటాయి.ఇక సామాజిక మాధ్యమాల్లో ఐ ఫోన్ కొనే వారి చాంతాడంత క్యూ ల ఫోటోలు మనం చూస్తుంటాము.

అయితే గతేడాది ఐఫోన్ 10 అమ్మ కాలు అంత ఆశా జనకంగా లేకపోవడంతో కారణాలు విశ్లేషించిన ఆపిల్ సంస్థ ఇందుకు కారణం ధర మరీ ఎక్కువగా ఉండడం, కొన్ని ఫీఛర్లు లేకపోవడమేనన్న నిర్ధారణకు వచ్చింది. ఈసారి విడుదల చేసే ఐఫోన్ కొత్త మోడల్ లో కొన్ని మార్పులు చేస్తుంది.

ఇప్పటికే ఈ మోడల్ పట్ల వినియోగ దారుల్లో ఆసక్తి రేకెత్తుతోంది.ఎందుకంటే ఈసారి వచ్చే ఐ ఫోన్ లో డ్యూయల్ సిమ్ ఫీఛర్ ను అందివ్వ నున్నారని సమాచారం. అంతే కాదు ఈసారి మోడల్ ధర కూడా అందుబాటు లోనే ఉండబోతోంది. తక్కువ ధరలోనే ఐ ఫోన్ 10మోడల్లోని అన్ని ఫీఛర్లతో పాటూ అదనంగా రెండు సిమ్ స్లాట్లు ఉండే విధంగా రూపొందిస్తున్నారు.

3

ఐఫోన్ లో బడ్జెట్ మోడళ్ళు:
ఆపిల్ త్వరలో విడుదల చేయనున్న బడ్జెట్ మోడళ్ళ లో ఫోన్ డిస్ప్లే తెర విషయాల్లో కొన్ని మార్పు లు చేయనున్నారు.

ఎల్. ఇ .డీ డిస్‌ప్లే బదులు సాంప్రదాయ ఎల్ సి డి డిస్‌ప్లే ఉంటుంది.

అలాగే ఫోన్ తెర 6.5 అంగుళాలు ఉండొచ్చు.

ఫోన్ యెక్క అల్యూమినియం బాడీ బదులు ప్లాస్టిక్ వాడుతున్నారు.

ఈ మార్పుల వల్ల ఐ ఫోన్ ధర బాగా తగ్గవచ్చని, ఐ ఫోన్ అందు బాటు ధరలో ఉండడంతో మార్కెట్ లో డిమాండ్ బాగా పెరుగు తుందని అంచనా. దీనితో పాటు 5.8 అంగుళాల డిస్ప్లే గల ఒక హై-ఎండ్ ఫోన్ కూడా విడుదల చేస్తోంది.ఇవన్నీ ప్రస్తుతానికి ఊహా గానాలే అయినా, అందుదబాటు ధరల్లోకే ఐ ఫోన్ రావాలని కోరుకొందాం.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)