Home / Inspiring Stories / డ్రైవింగ్ లైసెన్స్ ని ఇలా అప్లై చేసుకుంటే..! లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

డ్రైవింగ్ లైసెన్స్ ని ఇలా అప్లై చేసుకుంటే..! లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

Author:

వాహనాలని నడపాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని మనందరికీ తెలుసు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే కటకటాల లోకి వెళ్లేలా సరికొత్త నిబంధనలని ప్రభుత్వం తీసుకరాబోతుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే, కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంటే చాలా పెద్ద పని ఆర్టీఏ అధికారులకి లంచం ఇవ్వాలి, బ్రోకర్ లని పట్టుకోవాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి అని చాలామంది లైసెన్స్ అప్లై చేయరు, కానీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కువ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, బ్రోకర్ లని ఆశ్రయించకుండా, అధికారులకి లంచం ఇవ్వకుండా ఆన్ లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ని పొందవచ్చు.

how to apply driving license in online telangana andhra pradesh

ఆర్టీఏ శాఖాకి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారుwww.transport.telangana.gov.inఅనే వెబ్ సైట్ ద్వారా , ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు www.aptransport.org అనే వెబ్ సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేయవచ్చు. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత లైసెన్స్ అనే ఆప్షన్ ని సెలక్ట్ చేసుకొని కావాల్సిన లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు, వివరాలు నింపిన తరువాత ఆన్ లైన్ ద్వారానే డబ్బులు చెల్లించి లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కి స్లాట్ (ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లి పరీక్షా రాయాల్సి ఉంటుంది) బుక్ చేసుకోవాలి, ల్ పరీక్షా రాసిన నెల రోజుల తరువాత డ్రైవింగ్ టెస్ట్ కి వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ కి హాజరవ్వాలి, ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికే వచ్చేస్తుంది, ఇందుకోసం బ్రోకర్ లని ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

ఆర్టీఏ వెబ్ సైట్ లో లైసెన్స్ తో వాహనాల రిజిస్ట్రేషన్ గురుంచి , ఆర్టీఏ లో ఏ పనికి ఎంత రుసుము కట్టాలో, అలాగే మీ వాహనం పై ఏవైనా ఫైన్ లు ఉన్నాయో..? లేదో..? లాంటి విషయాలు తెలుసుకోవచ్చు.

Telangana RTA Website : www.transport.telangana.gov.in

Andhra Pradesh RTA Website: www.aptransport.org

(Visited 4,573 times, 1 visits today)