Home / Latest Alajadi / ఇకపై డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా పాసుపోర్టు

ఇకపై డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా పాసుపోర్టు

Author:

పాసుపోర్టు పొందాలంటే చాలా నిబంధనలతో కూడుకున్న పని దేశంలో చాలా తక్కువ మందికే పాసుపోర్టు ఉంటుంది. ఇప్పటి వరకు పాసుపోర్టు కోసం అప్లై చేయాలంటే తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఉండాలి. కానీ, పాస్ పోర్టు నిబంధనలను మరింత సరళతరం చేసింది కేంద్రం. దేశంలోని ప్రజలు సులభంగా పాస్ పోర్టు పొందేందుకు వీలు కల్పించింది. ఇప్పటి వరకూ పుట్టిన తేదీకి సంబంధించిన నిర్ణయం అమల్లో ఉండేది. జనవరి 26, 1989 తర్వాత పుట్టినవారెవరైనా సరే పాస్ పోర్టుకు దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా పంచాయతీ, పున్సిపాలిటి, కార్పొరేషన్ జారీచేసిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండేది. పదో తరగతి సర్టిఫికెట్ ఇస్తే చెల్లదు. ఇదే అదనుగా దళారులు ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రస్తుతం ఆ నిబంధనను పూర్తిగా తొలగించింది. ఇకపై ఆధార్ కార్డ్, ఓటరు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఐసీ పాలసీ బాండ్, టెన్త్ సర్టిఫికెట్ ఏదైనా పుట్టినతేదీ ఉన్న సర్టిఫికెట్ ఇస్తే చాలు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

apply-passport-without-birth-certificate

పెళ్లి చేసుకున్న వాళ్లు దరఖాస్తు చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికెట్, జీవిత భాగస్వామి పేరు రాయాల్సి ఉండేది. ఇక పై వీటిని సమర్పించాల్సిన అవసరం లేదు. తల్లి, తండ్రి దగ్గర పెరుగుతున్న పిల్లలు దరఖాస్తు చేసుకుంటే పేరెంట్ అనే కాలమ్ లో ఎవరి పేరు రాసినా సరిపోతుంది. తప్పని సరిగా తండ్రి పేరు రాయాలనే నిబంధన లేదు. అనాధ ఆశ్రయంలో పెరిగిన పిల్లలు అయితే ఆ ఆశ్రయం నిర్వాహకులు పుట్టిన తేదీని చెబితే సరిపోతుంది. గతంలో ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వస్తే డ్యాక్యుమెంట్ పేపర్ పై నోటరీ చేయించి ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. కేవలం తెల్ల కాగితంపై రాసి, సెల్ప్ డిక్లరేషన్ ఇస్తే చాలు. హిందూ సాధువులు, సన్యాసులు తమ తల్లిదండ్రుల స్థానంలో వారి ఆధ్యాత్మిక గురువు పేరును తెలిపితే చాలు. ప్రధాన పోస్టాఫీసుల్లో కూడా పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

(Visited 4,222 times, 1 visits today)