Home / Videos / అప్రమత్తతకు, ప్రమాదానికి మధ్య గ్యాప్ రెండే రెండు నిమిషాలు!

అప్రమత్తతకు, ప్రమాదానికి మధ్య గ్యాప్ రెండే రెండు నిమిషాలు!

ఇదో రకం సరదా…ఉట్టి పుణ్యానికి ఇల్లు కాల బెట్టుకుంటున్న ఈ జపాన్ పెద్దమనిషిని చూస్తున్నారుగా….చిన్న అగ్గిపుల్ల గీసి ఇల్లు తగలబెట్టుకునే దాకా తెచ్చుకోవడం…తీరా , అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోవడం..ఎందుకొచ్చిన పంచాయతీ…..ఆయన కావాలని చేయలేదు కానీ….తీరా ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత బాధ పడి ఏమి ప్రయోజనం? దీనిపైన ప్రజలను జాగృతం చేయటం కోసం జపాన్ అగ్నిమాపక శాఖ ఈ వీడియో నే సాధనంగా చేసుకుంది.

అగ్నిప్రమాదం జరిగిన ఆరు నిమిషాల వ్యవధిలోగా కనుక స్పందిస్తే….ఆ ప్రమాదం నుంచి ఇంటి ని ఒంటి ని కూడా కాపాడుకోవచ్చునని వారు శాస్త్ర బద్ధంగా లెక్కలు కట్టి మరీ చెపుతున్నారు. ఒక వేళ, ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎనిమిది నిమిషాలు దాటితే..ఇల్లూ….ఒళ్లూ గుల్ల కావటం ఖాయమని అంటున్నారు. ప్రాధమిక జాగ్రత్తలు పాటిస్తే, ఎలా ఫైర్ యాక్సిడెంట్ నుంచి బయటపడవచ్చుననే రీతిలో ….ప్రస్తుతం సోషల్ మీడియా లో నడుస్తున్న ఈ వీడియో ద్వారా జపాన్ అగ్నిమాపక శాఖ కొన్ని సూచనలు చేసింది. దేశం ఏదైనా, జాగ్రత్తలు ఒకటే కాబట్టి….అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించవలసిన తక్షణ జాగ్రత్తలు, నివారణకు ఉపాయాల విషయం లో ఆ చిన్న దేశం, అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం రెండే రెండు నిమిషాల వ్యవధి ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవటానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ని ఆ దేశం ఎంత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుంటోందో వేరే చెప్పనక్కర్లేదు కదా!

(Visited 82 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]