Home / health / మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా…?

మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా…?

Author:

మొన్నటి వరకు ఎండాకాలం దాహం వేసిన ప్రతిసారి చుట్టుపక్కల ఉన్న నల్ల దగ్గరో లేదా బోరింగ్ దగ్గరలో కాకుండా కూల్ గా ఉండే  వాటర్ బాటిల్ కోసం షాప్ ల వెంబడి తిరిగి దాహాన్ని తీర్చుకున్నాం. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది.. బయట ఎక్కడ చూసిన బురద, మురికి నీరు ఉంటుంది కాబట్టి కచ్చితంగా మళ్ళీ వాటర్ బాటిల్ కోసం షాప్ ల దగ్గరికి వెళ్లడమే అనుకుంటున్నారు చాలా మంది కానీ ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే మీరు తాగే బాటిల్ నీరు స్వచ్చమైనవి కావు …. అదేంటి మేము తాగేది మినరల్ వాటర్ అందులో పేరున్న కంపెనీ కిన్లే, బ్లిస్లరీ వాటర్.. మరి స్వచ్చమైనవి కావు అంటున్నారు అనుకుంటున్నారా…!

Know-the-health-risks-of-drinking-Mineral-Water-supplied-by-Local-Vendors

మీరు తాగే మినరల్ వాటర్ కంటే రోడ్ మీద ఉన్న నల్ల, బోరింగ్ నుండి వచ్చే నీరే స్వచ్చమైనవి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. ఎందుకంటే మినరల్ వాటర్ తయారుచేసే చాలా కంపెనీలకు సరైన లైసెన్సులే లేవంటున్నారు. మన దేశంలో మొత్తం 6000 మినరల్ వాటర్ ప్యాకేజింగ్ కంపెనీలుంటే వాటిలో 4500 యూనిట్లకు సరైన లైసెన్సులే లేవంటున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే సరైన లైసెన్స్ లేకుండా మినరల్ వాటర్ తయారుచేస్తున్న కంపనీలలో  కిన్లే, బ్లిస్లరీ, యాక్వఫినో  కంపనీలకు చెందిన బ్రాంచ్ లు కూడా ఉన్నాయి. చాలా మినరల్ వాటర్ కంపనీలకు అసలు మినరల్ వాటర్ అంటే అందులో ఎం ఉండాలో కూడా తెలియదని, నీటిని ప్రమాణాలకు తగ్గట్లు శుభ్రపరచకుండా అలాగే బాటిళ్లలో నింపి అమ్మేస్తూన్నరనని అధికారులు పేర్కొన్నారు.

బ్రాండెడ్ కంపెనీ అని చెప్పుకుంటూ నాసిరకం వాటర్ అమ్మడంతో చాలా మంది నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ పరిశీలన మొదలుపెట్టారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సరైన లైసెన్స్ లేని కంపెనీల లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు అధికారులు, అలాగే ప్రతి కంపెనీ కచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల నుంచి కచ్చితంగా రెండు లైసెన్సులు పొంది ఉండాలని అలాగే కచ్చితమైన ప్రామాణాలను పాటించాలని అధికారులు ఆదేశించారు.

అలాంటి పేరున్న పెద్ద కంపెనీలకే లైసెన్స్ లు లేవంటే మన గల్లీలలో ఉండే మినరల్ వాటర్ ప్లాంట్ లలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది, నీళ్ళని మంచిగా ప్యూరిఫై చేయకుండా రుచిగా ఉండేందుకు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలని కలుపుతారు, ఆ నీటినే పదే పదే తాగడం వల్ల చాలా రోగాలు వస్తాయి, మినరల్ వాటర్ తాగడం కంటే నల్ల నీళ్లనే మన ఇంట్లోనే ప్యూరిఫై చేసుకొని తాగడం చాలా ఉత్తమం, ఇప్పుడు మన ఇంట్లోనే వాటర్ ని ప్యూరిఫై చేసుకునేట్టుగా చాలా పరికరాలు మార్కెట్ లోకి వచ్చాయి..!

Must Read: ఇది తాగితే 15 రోజులలో బలహీనంగా ఉన్న మీ ఎముకలు బలంగా అవుతాయి.

(Visited 8,750 times, 1 visits today)