Home / Political / నా గొంతు కోసినా “భారత్ మాతాకి జై అనను”

నా గొంతు కోసినా “భారత్ మాతాకి జై అనను”

Author:

Asaduddin-Owaisi against bharat matha kii jai

భారత్ దేశానికి తప్ప తమ దేశాన్ని ఒక దేవతకి ప్రతి రూపంగా చూసుకునే సాంప్రదాయం మరే దేశానికీ లేదు. తమ తమ దేశాల జాతీయ పతాకాలను గౌరవించటం తప్ప, దేవుడిగా కొలిచే పద్దతి ప్రపంచంలో ఇంకేదేశానికీ లేదు. మొదటి నుంచీ హిందూ ప్రాబల్యం ఉన్న దేశం కావటంతో భారత దేశం భారత మాతగా పిలవబడింది, కొందరితో పూజించబడింది కూడా. ఇప్పటికీ తాము రోజూ పూజించే దేవతల పటాల పక్కన భారత మాత ఫొటోని కూడా ఉంచి పూజించే వాళ్ళూ ఉన్నారు. అయితే ఇన్నాళ్ళూ “వందేమాతరం” పాడాల్సిందే అంటూ మెజారిటీ,మైనారిటీ వర్గాల మధ్య ఒక వివాదం రగులుతూనే ఉంది. సృష్టికర్తను తప్ప ఎవరినీ పూజించం అనే ఒక ప్రధాన వర్గం “విగ్రహారాధనకు” సమర్థింపుగా ఉన్న ఆ గీతన్ని మేము పాడబోమూ అంటూ అభ్యతంతరం చెప్పింది. దాంతో ఆ వివాదం ఇరువర్గాల మధ్య దూరాన్ని పెంచింది.

అయితే ఇదే తరహా మరో వివాదం ఇప్పుడు రాజుకుంది. ‘ఈ తరం యువతకు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం నేర్పాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘‘మీరు నా పీక మీద కత్తి పెట్టినా సరే.. ‘ఆ’ నినాదం చేయను. నన్నేం చేస్తారు భగవత్ సాహెబ్‌?’’అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర లాతూరు జిల్లా ఉద్‌గిర్‌ తహసీల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయగానే ప్రజల నుంచి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. దీంతో ఒవైసీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘‘భారత మాతా కీ జై’ అని తప్పనిసరిగా అనాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని గుర్తు చేసారు.తమకు దేశం అంటే చుట్టూ ఉన్న మనుషులే తప్ప బొమ్మలూ,మ్యాపులూ కాదనీ, దేశాన్ని కాపాడటం, దేశభక్తి కలిగి ఉండటం కంటే సాటి పౌరులని ప్రేమతో చూస్తూ, వారికి రక్షణ కల్పించటమే అనీ ఆయన అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఇప్పటికే భారత్ లో అసహనం నేపథ్యం లో ప్రాదాన్యత సంతరించుకున్నాయి. కాగా, ‘భారత మాతా కీ జై’ అని నినదించడం ఎవరి ఇష్టం వారిదని కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్‌ అభిప్రాయపడ్డారు.

(Visited 262 times, 1 visits today)