Home / Entertainment / అసలైన శ్రీమంతుడు మహేష్ బాబే

అసలైన శ్రీమంతుడు మహేష్ బాబే

Author:
టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా విజయవంతం అయి సూపర్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలాగైతే ఒక ఊరిని దత్తత తీసుకొని దాని అభివృధ్ధికి పాటుపడతారో.. దాని స్ఫూర్తితో రియల్ లైఫ్ లో కూడా ఊరిని దత్తత తీసుకుంటున్నారట. దీనికి కారణం తెలంగాణ సీఎం కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ అంట. అసలు సంగతేంటంటే, శ్రీమంతుడు సినిమాపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబుకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఆయనే స్వయంగా మహేశ్ బాబుకు ఫోనే చేసి సినిమా బావుందని అభినందనలు తెలిపి గ్రామజ్యోతి పథకంలో భాగంగా, సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలని కోరారట. దీనికి మహేష్ బాబు కూడా సానుకూలంగానే స్పందించారట. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ బాబే ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.
మరోవైపు మహేశ్ బాబు ఏపీలో కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు నిర్ణయించుకున్నానని మహేష్ తెలిపారు. మొత్తానికి మహేశ్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడనిపించాడు.
(Visited 43 times, 1 visits today)