Home / Inspiring Stories / ఆటో డ్రైవర్ కూతురు 12 బంగారు పతకాలు సాధించింది.

ఆటో డ్రైవర్ కూతురు 12 బంగారు పతకాలు సాధించింది.

Author:

12 Gold Medals Mysore 2

పేదరికంలో పుట్టిన చదువుని కష్టంగా కాకుండా ఇంట్లో వారు పడే కష్టాన్ని చూసి చదువు పై ఇష్టాన్ని పెంచుకొని ఏకంగా పన్నెండు పతకాలు సాధించింది ఒక అమ్మాయి. అది కూడా మాములు సబ్జెక్టు కాదు కెమిస్ట్రీలో. వారిది మాములు పేదరికం కాదు వారి నాన్న ఆటో మీటర్ తిరుగుతేనే వారి ఇంట్లో అన్నం ఉడికేది. అలాంటి పేదరికంలో పుట్టిన ప్రతిష్టాత్మకమైన మైసూరు విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో పన్నెండు పతకాలు సాధించిందిన పేదింటి సరస్వతి సుమ. ఇంక తన గురించి తన మాటల్లో…

12 Gold Medals Mysore 2

మేము ఉండేది మైసుర్, అక్కడ చాలా మంది చాలావరకూ పర్యటకు వచ్చే వారిని నమ్ముకొని జీవిస్తారు. అన్ని సమయాల కంటె దసర ముందు రోజు చాలా రద్దిగా ఉంటుంది ఈ ప్రాంతం. ఆ సమయంలోనే మేము ఎక్కువ అవసరాలు తీర్చుకొనేది ఎందుకంటే మా నాన్నకు ఆ సమయంలోనే ఆటో తోలితే ఎక్కువగా డబ్బులు వస్తాయి. అది పోగా మిగతా రోజులు మీటర్‌ తిరగడాన్నిబట్టే మా ఆర్థిక కష్టసుఖాలు ఆధారపడి ఉంటాయి. అమ్మ లక్ష్మి ఓ గోల్ఫ్‌ క్లబ్‌లో పనిచేస్తున్నా ఆమెకు అత్తెసరు జీతమే. నేను ఈ రోజు ఇన్ని పతకాలు సాదించాడానికి కారణం వారు కష్టపడి చిందించిన చెమటే . నన్ను పదవ తరగతి వరకు ప్రైవేటు బడిలో చదివించారు మా అమ్మనాన్న. ఆ సమయంలో ఒక్కోసారి సకాలంలో ఫీజు కట్టలేక ఉపాధ్యాయుల దగ్గర తిట్లు తిన్నప్పుడు.. నాన్నపై చాలా కోపం వచ్చేది! కానీ డబ్బుకి పేదైనా నాన్న నాపై పెట్టుకున్న ఆశలు బోలెడు. నేను చదివి చాలా గొప్పదాన్ని కావాలని పదే పదే చెప్పేవారు. ఆ తర్వాత నేను ఓ ప్రభుత్వ కాలేజీలోనే చేరాను దానికి కారణం మా చెల్లి. ఎందుకంటే నా చదువుకి మా చెల్లి చదువుకి ప్రైవేటులో చదివించి ఖర్చు చేసేంత స్థోమత ఆర్దిక మా కుటుంబానికి లేదు. నా పేదరికం సంగతి తెలిసిన అధ్యాపకులు కొంత సాయపడ్డారు. అన్నీ కళాశాల గ్రంథాలయం నుండే తెచ్చుకుని చదివి.. 86 శాతం మార్కులతో బయటకొచ్చా! అదే కళాశాలలోనే బీఎస్సీ చేరాను.కెమిస్ట్రీపై పూర్తిస్థాయిలో ఇష్టం ఏర్పడింది కూడా అప్పుడే. ఆ ఇష్టమే డిగ్రీలో 87.5 శాతం మార్కులతో బయటకొచ్చాను.

12 Gold Medals Mysore 2

మా నాన్న నా కోసం పెద్ద చదువులు చదువుతున్న అని ఆటో నడవని రోజుల్లో కూడా అప్పు చేసి మరి నా కోసం మంచి దుస్తులు తీసుకొచ్చేవాడు. ఇవన్నీ నాలో నరనరానా బాధ్యతని నింపాయి. ఏకాగ్రత మొత్తాన్ని రసాయన శాస్త్రం పై నిలిపేలా చేశాయి. ఇలాంటి కష్టాలలో కూడా స్నేహితులు అధ్యాపకులు నాకు అన్ని విధాల సహాయం చేసేవారు వాళ్లందరి సహకారంతోనే ఎమ్మెస్సీలో 86 శాతం మార్కులు సాధించగలిగా. కానీ 12 బంగారు పతకాలు వస్తాయని నేనెప్పుడూ వూహించలేదు. స్నాతకోత్సవమప్పుడు నన్ను పదే పదే పిలుస్తుంటే.. నేను మళ్లీ మళ్లీ రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నుంచి పతకాలు అందుకుంటూ ఉంటే ఆనందంతో అమ్మ నాన్న కంట్లో నీరు ఆగలేదు. పీహెచ్‌డీ చేసి కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టాలన్నదే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అంటుంది ఈ పేదింటి సరస్వతి సుమ.

(Visited 626 times, 1 visits today)