Home / health / న్యూస్ పేపర్లో ఆహార పదార్ధాలు తింటున్నారా?

న్యూస్ పేపర్లో ఆహార పదార్ధాలు తింటున్నారా?

Author:

పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు జనమంతా వేడి పదార్ధాలనే తినటానికి ఇష్టపడతారు. సాయంకాలం పూట బయటికి వెళ్తే పునుగులు, మిర్చి బజ్జీలు మరియు సమోసా కానీ, వేడి వేడిగా అందరికి తినాలనిపిస్తుంది. ఇవి ఎక్కువగా రోడ్డు మీద బండ్లపై లభిస్తాయి. ఈ పదార్ధాలలో నూనెను వదిలించుకోవటం కోసం న్యూస్ పేపర్లో వేసుకొని తింటూ ఉంటాం. నూనె వదిలించుకోవటం ఆరోగ్యంగా మంచి నిర్ణయమైనప్పటికీ, న్యూస్ పేపర్ ద్వారా నూనె ని తొలగించి తినటం చాలా ప్రమాదం. తిన్నాక ఆ న్యూస్ పేపర్ తో చేతులు తుడుచుకోవటం కూడా చల్ల ప్రమాదకరం. పత్రిక పొడిగా ఉన్నంతసేపు దానితో ప్రమాదమేమి ఉండదని వారు చెప్తున్నారు. ఎప్పుడైతే పత్రిక తడి బారిన పడుతుందో.. అందులోని గ్రాఫైట్ ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

uses-of-coconut-for-health

ఆహార పదార్ధాలను పేపర్ల లో చుట్టుకొని తినడం వలన ఆ పేపర్లలోని గ్రాఫైట్ శరీరంలోకి చేరిపోయి ఏకంగా కిడ్నీలు, కాలేయం చెడిపోయే ప్రమాదం ఉంది. గ్రాఫైట్ ఎంత ప్రమాదకరమంటే.. కణాలు, ఎముకల ఎదుగుదలను నిరోధిస్తుంది. గ్రాఫైట్ శరీరంలో అలానే పేరుకుపోతాయని.. తద్వారా తీవ్ర అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోడ్ సైడ్ స్నాక్స్‌ను పార్శిల్స్ ద్వారా న్యూస్ పేపర్‌లో చుట్టుకెళ్లి తినడం అంత మంచిది కాదని, పేపర్లో స్నాక్స్ తీసుకెళ్లడం.. చేస్తే రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(Visited 1,800 times, 1 visits today)