Home / Entertainment / ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్..!

ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్..!

Author:

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత దృష్టి నుండి జాలువారిన ఒక సమ్మోహన సృష్టి బాహుబలి. ఈ సినిమాతో ఒక్క సారిగా ప్రపంచ దృష్టి మొత్తంగా  తెలుగు సినిమా పై పడింది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ చిత్రం ఆ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ అనేక రికార్డ్ లను నెలకొల్పింది. ఇక ఆ చిత్రం చివరిలో వచ్చే బాహుబలిని కట్టప్ప పొడిచే సీన్ తో ముగించి రెండో భాగానికి మరింత అంచనాలను పెంచాడు ఈ సెన్సేషన్ డైరెక్టర్.

Baahubali-Release-Date

మరి మొదటి భాగమే అంచనాలు లేకుండా అంత రిచ్ గా తీస్తే ఇక ఎన్నో అంచానాలతో వస్తున్నా రెండవ భాగం మరి ఎంతో రిచ్ గా తీతీయగలరో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు  బాహుబలి రెండవ భాగం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కేవలం క్లైమాక్స్ ఫైట్ కోసమే 30 కోట్లు, 2 నెలల సమయం తీసుకోని చేస్తున్నారు అంటే అది మాములు విషయం కాదు, మొదటి భాగాన్ని చాలా సార్లు వాయిదా వేసి వేసి విడుదల చేసారు, ఈసారి అలా కాకుండా పక్క ప్రణాళికతో పని చేస్తున్నారు, బాహుబలి రెండవ భాగం రిలీజ్ డేట్ ఈరోజే ప్రకటించారు, ఏప్రిల్ 28 న విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనేది తెలుసుకోవడం కోసం ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే..!

(Visited 336 times, 1 visits today)