Home / Entertainment / రిలీజ్ కి ముందే తన సత్తా చాటుతున్న బాహుబలి.

రిలీజ్ కి ముందే తన సత్తా చాటుతున్న బాహుబలి.

Author:

బాహుబలి ఈ సినిమా పేరు చెబితే చాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతకు ముందు ఆ తరువాత అనే విధంగా మారింది. ఒక మామూలు ప్రాంతీయ చిత్రం దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సినిమా. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ఇప్పుడు బాహుబలి 2 వస్తుంది. మొదటి భాగం పెంచిన అంచనాలను రెండవ భాగం అందుకోవాలని ఎన్నో రేట్లు మించేలా చాలా పకడ్బంధింగా తెరకెక్కిస్తున్నారు దర్శకదీరుడు రాజమౌళి గారు. ఈ సినిమా వచ్చే ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.కానీ ఈ సినిమా ఇప్పటినుండే వార్తల్లో నిలుస్తుంది.

baahubali-satellite-rights

మొదటి భాగంలో ప్రమోషన్స్ విషయంలో కొత్త పంథాని ఎంచుకొని ఎవరు ఊహించని విధంగా ప్రమోషన్స్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనతోనే బాహుబలి టీం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రెండవ పార్ట్ అయినా బాహుబలి 2 విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తుంది దానికి కారణం ప్రీ రిలీజ్ బిజినెస్. తాజాగా బాహుబలి 2 హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్ వర్క్ అయిన సోనీ 51 కోట్లకు కొనుగోలు చేసిందట!. ఒక ప్రాంతీయ చిత్రం బాలీవుడ్ లో అంత మొత్తంలో కొనుగోలు జరగటం ఇదే మొదటి సారి అంటున్నారు సినీ పెద్దలు.

(Visited 87 times, 1 visits today)