Home / Entertainment / బలి బలి బలిరా బలి…! బాక్స్ ఆఫీస్ మొత్తం బలి…!

బలి బలి బలిరా బలి…! బాక్స్ ఆఫీస్ మొత్తం బలి…!

Author:

బాహుబలి సినిమా దెబ్బకి ఇప్పటివరకు ఉన్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి, కనివిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ సునామిని బాహుబలి సినిమా సృష్టిస్తుంది, ఒక ప్రాంతీయ సినిమాని దేశం మొత్తం ఒక ఇండియన్ సినిమాగా భావించి బ్రహ్మరథం పట్టారు, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఊహించని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి, దాదాపు వారం రోజుల పాటు అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ బాహుబలి సరికొత్త రికార్డులని సృష్టించేలా ఉంది.

బాహుబలి కలెక్షన్స్ సునామి

తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్స్ లో బాహుబలి సినిమా మరో సినిమా ఇప్పట్లా అందుకోలేని రికార్డుని సృష్టించింది, బాహుబలి మొదటి భాగంతో ఫస్ట్ కలెక్షన్స్ లలో 22.4 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించిన బాహుబలి , రెండవ భాగంతో అంతుకుమించి కలెక్షన్స్ సాధించింది, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాలలోనే బాహుబలి కలెక్షన్స్ రూ.43 కోట్లని దాటిపోయాయి, ఇంకా తమిళనాడు, కేరళ , కర్ణాటక మరియు హిందీ వెర్షన్ ల కలెక్షన్స్ ని కలుపుకుంటే ఇండియా వరకే బాహుబలి కలెక్షన్స్ వంద కోట్లని సులభంగా దాటిపోయింది, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో మొదటి రోజు కలెక్షన్స్ లో రూ.200 కోట్ల గ్రాస్ ని దాటిన మొదటి భారతీయ సినిమాగా బాహుబలి నిలిచింది, హిందీలో ఏ బాలీవుడ్ హీరో కి కూడా సాధ్యపడని ఫస్ట్ డే రికార్డుని బాహుబలి సినిమా కొట్టేసింది, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రాస్ రూ.210 కోట్లు అయితే వరల్డ్ వైడ్ షేర్ రూ.163 కోట్లు ఇంకా పూర్తి సమాచారం వస్తే ఈ అంకెలు మారిపోయి కలెక్షన్స్ ఇంకా పెరిగే ఆవకాశం ఉంది.

 బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్:

  • నైజాం  –  8.90 Cr
  • సీడెడ్  –  6.35 Cr
  • వైజాగ్  –  4.50 Cr
  • ఈస్ట్  –    5.94 Cr
  • వెస్ట్  –    6.47 Cr
  • గుంటూరు –   6.18 Cr
  • నెల్లూరు  –   2.10 Cr
  • కృష్ణా  –  2.82 Cr

బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్ – తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ : 43.26 Cr

బాహుబలి ఇండియా వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్:

  • తమిళనాడు – 14.18 Cr
  • కర్ణాటక – 12.40 Cr
  • కేరళ – 5.50 Cr
  • హిందీ వెర్షన్ – 39.70 Cr

Bahubali First Day Total Collections (India) :  115.04 Cr 

Bahubali First Day Total Collections (Overseas): 48 Cr 

Bahubali World Wide First Day Collections (India + Overseas) : 163.04 Cr

Bahubali World Wide First Day Gross  : 210 Cr

(Visited 2,418 times, 1 visits today)