Home / Entertainment / చైనాలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న బాహుబలి.

చైనాలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న బాహుబలి.

Author:

Baahubali

‘బాహుబలి’ దర్శక ధీరుడు రాజమౌళి అలోచనల నుండి వచ్చిన ఒక అద్బుత మహ కావ్యం అనవచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన విషయం మనకు తెలిసిందే, ఈ సినిమా గతేడాది జూలై నెలలో విడుదలై దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొంది అక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇక పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్‌తో చైనా, జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు పలు టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకు వచ్చాయి.

ఇండియాలో విడుదలైన వర్షన్ కాకుండా సుమారు 20 నిమిషాల కుదింపుతో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ తయారు చేశారు. ఇక ఈ సినిమాను సొంతం చేసుకున్న ఆయా దేశాల డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఒక సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాలో ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయనున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్న ఈ స్టార్స్ ఫిల్మ్స్ ప్రకటించింది. సుమారు 6000స్క్రీన్లలో చైనాలో బాహుబలి సినిమాను విడుదల చేసేలా ఈ స్టార్స్ ప్లాన్ చేస్తోంది. మే నెల ఆ దేశంలో సినిమాలకు సీజన్ కూడా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈమతకు ముందు పికె సినిమాను చైనాలో రిలీజ్ చేసిన ఇ స్టార్ ఫిలింస్ సంస్థతో కలిసి బాహుబలి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు పికె సినిమాను 5000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేసిన ఈ సంస్ధ బాహుబలి సినిమాను 6000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

(Visited 205 times, 1 visits today)