Home / Entertainment / ఐఫా అవార్డులలో బాహుబలి సంచలనం.

ఐఫా అవార్డులలో బాహుబలి సంచలనం.

Author:

Bahubali Awards

ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ( ఐఫా) భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అవార్డ్స్‌ ప్రధానోత్సవం హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ ఉత్తరాదికే పరిమితమైన అవార్డ్స్‌ను ఈసారి దక్షిణాది నటులకు కూడా ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం మొదలైంది. ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా అవార్డుల కార్యక్రమానికి తారాలోకం దిగివచ్చింది. అవార్డ్‌లను ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్నా… ఇన్నాళ్లూ ఉత్తరాదికే ఇవి పరిమితమయ్యాయి. ఇప్పుడు దక్షిణాది సినిమాలకు స్థానం దక్కింది.

రెండ్రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం తొలిరోజున గచ్చిబౌలి స్టేడియం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌ సెలబ్రిటీలతో కళకళలాడింది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. తొలి రోజు కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా విచ్చేసి వేడుకని ప్రారంభించారు. కె. బాలచందర్, వాసుదేవన్, ఎం.ఎస్ విశ్వనాథన్ లకు లెజండ్రీ పురష్కారాల్ని అందించారు. మలయాళ చిత్రం ప్రేమమ్ మరియు బాహుబలి చిత్రాలకు పలు పురష్కారాలు అందాయి.అలాగే ఈ వేడుకలో పాల్గొన్న చాలా మంది తారామణులు తమ నృత్య ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ రోజు రెండవ రోజు వేడుకలు జరగనున్నాయి. ఇందులో తెలుగు, కన్నడ చిత్ర సీమకి సంబదించిన అవార్డులను బహుకరించనున్నారు. రామ్‌చరణ్‌, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్‌ తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు….తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చాటిన బాహుబలి అన్ని విభాగాల్లో రాణించి నామినీస్ లో ప్రముఖ స్థానంలో నిలిచింది. ఉత్తమ దర్శకుడు – ఉత్తమ సహాయ నటులు (మేల్ – ఫిమేల్) ఉత్తమ గాయకులు (మేల్ -ఫిమేల్)తోపాటు ఉత్తమ చిత్రంగా కూడా బాహుబలికి పురస్కారాలు దక్కాయి.

(Visited 140 times, 1 visits today)