Home / Entertainment / ‘బాబు బంగారం’ రివ్యూ & రేటింగ్

‘బాబు బంగారం’ రివ్యూ & రేటింగ్

Babu-Bangaram-Perfect-review-and-rating

Alajadi Rating

2.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: వెంకటేష్ - నయనతార - సంపత్ - పోసాని కృష్ణమురళి - జయప్రకాష్ - పృథ్వీ - బ్రహ్మానందం - వెన్నెల కిషోర్ - షావుకారు జానకి - గిరి తదితరులు

Directed by: మారుతి

Produced by: సూర్యదేవర నాగవంశీ

Banner: సితార ఎంటెర్టైనమెంట్స్

Music Composed by: జిబ్రాన్

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల చిత్రం తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోని తన బాడీ లుక్స్ కొద్దిగా మార్చుకొని స్టైలిష్ గా తయ్యారు అయి ఇప్పుడు ….,భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన మారుతితో కలసి చేసిన  చిత్రం బాబు బంగారం. లక్ష్మి, తులసి లాంటి సూపర్ హిట్ చిత్రాల జోడి అనిపించుకున్నవెంకీ, నయన తార జోడి ఈ చిత్రం లో నటించడం విశేషం. ఇక ఈ సినిమా ఇప్పటికే వెంకీ కేరీర్‌లోనే అత్య‌ధిక ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఈ రోజు మన ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

కథ :

ఎసిపి కృష్ణ( వెంకటేష్) చాలా మంచి మనసున్న వ్యక్తి. తన తాత నుండి వారసత్వంగా వచ్చిన  మంచి మనసుని పోలీస్ అయిన తనలో ఆ జాలి గుణం ఏమాత్రం తగ్గదు. ఆపదలో ఎవరైనా ఉంటే తాను తట్టుకోలేడు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి  తోలి చూపులోనే శైలజ ప్రేమలో పడుతాడు. కొద్దీ రోజుల తరవాత తన స్వార్థానికి తనని ప్రేమిస్తున్నాడని శైలజ, కృష్ణ ప్రేమని తిరస్కరిస్తుంది. అలాగే అదే సమాయంతో శైలజ కుటుంబానికి మొత్తం, ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని కృష్ణమురళి), మల్లేష్ యాదవ్( సంపత్ రాజ్ )ల నుంచి ముప్పు ఉంటుంది. ఇంతకు వారికి శైలజ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి! వారీ నుండి శైలజ ను ఎలా రక్షించున్నాడు అనేదే మీరు సినిమాను చూడవలసిందే.

అలజడి విశ్లేషణ:

భలే భలేమగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి ఈ సినిమాను చాలా సేఫ్ జోను గా ఎంచుకున్నాడు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా క‌థ‌ విషయానికి వ‌స్తే క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. చాలా రొటీన్ స్టోరీ. అలాగే కథనం లో కూడ ఎక్కడ ఎలాంటి మార్పు లేకుండా ఎక్కుగా కామెడీ సీన్స్ రాసుకొని ఒక మామూలు బండిని లాగించాలని చూశాడు. ఫ‌స్టాఫ్‌లో వెంకీ-న‌య‌న మ‌ధ్య రొమాంటిక్ సీన్లతో క‌థ‌నాన్ని లాక్కొచ్చాడు.

ఫ‌స్టాఫ్‌లో వినోదం, వెంకీ, నయనతార రొమాంటిక్ తో లాక్కొచ్చి ప్రేక్షకుడికి అసలు స్టోరీ ఏంటో అర్థం కాలేదు. సరిగ్గా ఇంటర్వెల్ వస్తోందనగా కొద్దికొద్దిగా తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ గురించి అర్థమవుతుంది. కానీ అక్కడ నుండి కథని నడిపించడంలో కాస్త తడపడ్డాడు దర్శకుడు. సెకండాఫ్ మొత్తం సీరియ‌స్‌గా సాగుతుంది. మ‌ధ్య‌లో పోసానితో కామెడీ సీన్లు పెట్టినా అవి అంతగా పేలాలేదు. మొత్తానికి ఫస్టాఫ్ తో పోలుకుంటే మాత్రం సెకాండాఫ్ చాలా తగ్గింది అని చెప్పాలి.

నటీనటుల పనితీరు:

చాలా రోజుల తరవాత వెంకీ నుండి వచ్చిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వెంకీ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. తన కామెడీ టైమింగ్ తో సినిమా హాలులో నవ్వులు పూయించారు. కామెడీ సీన్స్ తో పాటు  యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లోను ఆకట్టుకున్నాడు. వెంకీ కి జోడిగా నటించిన నయన తార లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపించింది కానీ తనకు నటన పరంగా మాత్రం తక్కువ మార్కులే పడ్డాయి.

ఈ సినిమాలో బత్తాయి బాబ్జీ పాత్రలో 30 ఇయర్స్ పృద్వీ ఫస్ట్ ఆఫ్ అంత తెగ నవ్వించాడు. అలాగే ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్లు పర్వాలేదనిపించిన. జబర్దస్త్ టీం మాత్రం కొద్దిగా ఓవర్ కామెడీ చేసింది.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఉందంటే మాత్రం అది సంగీతం. ఈ సినిమాకు జిబ్రాన్ అద్భుతమైన సంగీతం తో పాటు కామెడీ, సీరియ‌స్ సీన్ల‌కు అనుగుణంగా చ‌క్క‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. రిచ‌ర్డ్ కెమేరా వ‌ర్క్ బాగుంది. ఇక ఉద్ద‌వ్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త పని పెడితే బాగుండు. ఇక రవి వర్మ కంపోజ్ చేసిన ఫైట్స్ చూడటానికి బాగున్నాయి. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ-పీడీవీ.ప్ర‌సాద్ లు కొత్త నిర్మాతలు అయిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • వెంకటేష్
  • కామెడీ సీన్స్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • డైరెక్షన్

పంచ్ లైన్: అయ్యో అయ్యో అయ్యయ్యో ఈ బంగారాన్ని రోల్డ్ గోల్డ్ తో చేశారే

 

(Visited 136 times, 1 visits today)