Home / Entertainment / జులై 9న పాటలు వినిపిస్తా అంటున్న బాబు ‘బంగారం’

జులై 9న పాటలు వినిపిస్తా అంటున్న బాబు ‘బంగారం’

Author:

విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బాబు బంగారం’. ఇప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు తీసి తన ప్రతిభ ఏంటో అందరికి తెలియజేశాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాతో మొదటి సారిగా ఒక స్టార్ హీరోను డైరెక్షన్ చేస్తున్నాడు మారుతి. మొదటగా విడుదల చేసిన టీజర్ తో అందరి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. దాదాపు షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అలాగే ఈ సినిమాకు రన్ రాజా రన్, జిల్ వంటి సినిమాలకు సంగీతం అందించిన జిబ్రాన్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

babu bangaram audio release date venue
వచ్చే నెల 9 వ తేదీన బాబు బంగారం ఆడియో రిలీజ్ కానుంది.  అలాగే ఆడియో విడుదల వేదికపైనే ఎప్పుడు చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు అనేది చెప్పనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

(Visited 185 times, 1 visits today)