Home / Entertainment / 2017లో రిలీజ్ కానున్న బాహుబలి 2…?

2017లో రిలీజ్ కానున్న బాహుబలి 2…?

Author:

baahubali 2 postponed

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మ‌గ‌ధీర కోసం 2 సంవ‌త్స‌రాలు… ఈగ కోసం 2 సంవ‌త్స‌రాలు…బాహుబ‌లి కోసం 3 సంవ‌త్స‌రాల టైం తీసుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి…ఇప్పుడు బాహుబ‌లి 2 కోసం ఎన్ని సంవ‌త్స‌రాలు తీసుకుంటాడన్న అనుమానాలు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిని తొల‌చి వేస్తున్నాయి. క్వాలిటీ కోసం ఎక్క‌డా రాజీప‌డ‌కండా జ‌క్క‌న్న చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో జ‌క్క‌న్న సినిమాలు టూ లేట్ అవుతున్నాయి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు దాదాపు రెండేళ్ళు కష్టపడి చేసిన భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ ఏడాది జూలై 10న రిలీజ్ అయిన బాహుబలి వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలుపుకొని 600కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. బాహుబలి మరియు శివుడు అనే రెండు పాత్రల కోసం డిఫరెంట్ ఫిజిక్స్ ని కూడా మైంటైన్ చేసాడు. బాహుబలి రిలీజ్ తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం సెకండ్ పార్ట్ షూటింగ్ కి సిద్దమవుతోంది.

రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసాడు. ఇది వరకూ చెప్పిన దాని ప్రకారం బాహుబలి 2 డిసెంబర్ 14 నుంచి సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. కానీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఈ చిత్ర టీం రెండు రోజులు ఆలస్యంగా అనగా డిసెంబర్ 16 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ప్రభాస్ కూడా మళ్ళీ బాహుబలి కోసం కండలు పెంచేసి భారీ శరీరాకృతితో తయారయ్యాడు. బాహుబలి 1 కి మించి బాహుబలి 2 ఉండేలా రాజమౌళి కథని, అందులోని సన్నివేశాలను సిద్దం చేసేసారు. కాని ముందుగ అనుకున్న తేదికి బాహుబలి రిలీజ్ అవ్వటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే బాహుబలి మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువ vfx వర్క్ ఉంటుందని వినికిడి. జూరసిక్ పార్క్ వంటి సినిమాకు పనిచేసిన సాంకేతిక బృదం బాహుబలి కి చేసింది. ఇప్పుడు బాహుబలి2 కూడా అదే టీం పనిచేస్తుంది. బాహుబలి2 లో 65% యుద్ద సన్నివేశాలు ఉంటాయని వినికిడి దాని వలన అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వడం లేదని తెలుస్తుంది. 2016 నుండి 2017కు పోస్టుపోన్ అయ్యిందని తెలుస్తుంది.

(Visited 99 times, 1 visits today)