Home / Entertainment / అక్కడ బాహుబలి అట్టర్ ఫ్లాప్ అట.

అక్కడ బాహుబలి అట్టర్ ఫ్లాప్ అట.

Author:

bahubali deutsche version

బాహుబలి.. తెలుగు సినిమా రికార్డ్లు అన్నీ ఒక్కపెట్టున తిరగరాసి, తెలుగు సినిమా స్థాయిని ఒకేసారి వందమెట్లు ఎక్కించి చిత్రం. బాలీవుడ్లోనూ జెండా పాతి తెలుగోడి సత్తా చాటిన అద్బుత చిత్రం. సినిమా రిలీజ్ అయిన అన్నీ భాషల్లో మంచి వసూళ్ళు సాధించి, కమర్షియల్ హిట్ గానూ నిలిచిన చిత్రం.

ఒక్క భారతదేశం లోనే కాదండోయ్ చైనా, జపాన్ లో ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. కానీ జర్మనీలో మాత్రం బాహుబలి అనుకున్న స్థాయిలో కాదు కదా అసలు ఏ స్థాయిలోనూ వసూళ్లు రాబట్టలేకపోయింది అసలు అక్కడ బాహుబలి సీన్ రివర్స్ అయ్యింది. రీసెంట్ గా బాహుబలిని జర్మనీలో రిలీజ్ చేశారు. అక్కడ విడుదలైన తొలి వారంలో బాహుబలి కలక్షన్లు తీవ్ర నిరాశకు గురిచేశాయి, అసలు ఊహకి అందని అంత తక్కువ వసూలు చేసి జర్మనీ బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డది.

అంతా కలిపి కూడా మొదటి వారం మొత్తం మీద 4200 యూరోలు,అంటే రూపాయల్లో 3.3 లక్షలు మాత్రమే వసూలు చేసిందట. కనీసం జర్మనీలో ఉంటున్న మన ఇండియన్ ఆడియన్స్ చూసినా దీనికంటే ఎన్నో ఇంతల వసూళ్ళు చేసి ఉండేది. కానీ అక్కడ మాత్రం మన బాహుబలికి సీన్ రివర్స్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లుకు తీవ్ర నష్టం కూడా తెచ్చిపెట్టింది, జర్మన్ వాసులూ, లోకల్ లో ఉంటున్న మన ఇండియన్స్ ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు టీవీలో చూశారు అదీ కాక బ్లూరే ప్రింట్ DVD లు కూడా అందుబాటులో ఉన్నాయి, అందుకే ఎవరూ దియేటర్ కి వచ్చి చూడలేదు అని చెప్పుకొచ్చారు డిస్ట్రిబ్యూటర్లు.

(Visited 673 times, 1 visits today)