Home / Entertainment / బాహుబలి-2 రీలీజ్ డేట్ వచ్చేసింది!

బాహుబలి-2 రీలీజ్ డేట్ వచ్చేసింది!

Author:

Bahubali part2  release date

బాహుబలి సృష్టికర్త రాజమౌళీ ఏ సినిమా తీసిన చాలా టైం తీసుకోని చేస్తుంటాడు. కారణం తను అనుకున్న విధంగా వచ్చేవరకు సినిమా విషయంలో అసలు వెనకి తగ్గెది లేదు అనే రకం, అందుకే తననీ జక్కన్న అంటారు తెలిసిన వారు. ప్రతి సినిమాను ఒక శిల్పంలాగా మలుస్తాడు ఈ జక్కన్న. బాహుబలి మొదటి పార్ట్ విడుదలై ఎంత పెద్ద విజాయాన్ని అందించిందో మన అందరికి తెలిసిందే ఇప్పుడు బాహుబలి-2 ని అంతకుమించి ఉండాలని ఈ సినిమాను పార్ట్-1 కంటే పార్ట్-2 అత్యంత అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాడు ఈ సినిమా శిల్పి జక్కన్న. ఈ సినిమా రీలీజ్ పై ప్రతి రోజు ఒక కొత్త డేట్ రావడం సహజం అయిపోయింది. కానీ జక్కన్న నోటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటి రాలేదు దీనికి కారణం బాహుబలి అంటే గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉంటుంది పైగా ఇప్పుడు తీస్తున్నది సంచలనాలు సృష్టించిన బాహుబలికి సీక్వెల్. అంటే ఇందులో తొలి చిత్రం కంటే ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబటి ఇంతవరకు రీలీజ్ డేట్ బయటకి రాలేదు. కాని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ అయినట్టే. ఆ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదలవుతోంది. బాలీవుడ్ వర్గాలు ఆ విషయాన్ని తేల్చి చెప్పాయి. బాలీవుడ్లో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ముహుర్తం అప్పుడే రిలీజ్ డేట్ చెప్పాల్సి వుంటుంది. ఎందుకంటే ఇండియా వైడ్ సినిమా రీలీజ్ ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్లు ప్రిపేర్ కావల్సి ఉంటుంది. అందువల్నే బాలీవుడ్ వర్గాల ఒత్తిడిచేయడంతోనే బాహుబలి 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని వినికిడి.

(Visited 429 times, 1 visits today)