Home / Entertainment / బాహుబలికి బాలీవుడ్ ఆఫర్స్

బాహుబలికి బాలీవుడ్ ఆఫర్స్

Author:

Bahubali-Prabhas

బాహుబలి సంచలనంతో ఒక్క సినిమాతో ఎంత మంది ఈ సినిమాకు పని చేసారో అంత మంది నైట్ కి నైట్ దేశమంత ఒక్క సారిగా స్టార్స్ గా ఎదిగిపోయారు. ఇందులో ఎక్కువ పేరు వచ్చీంది దర్శకుడు రాజమౌలికి మరియు యంగ్ రెబల్ స్టార్ కి. ప్రభాస్ అప్పటికే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకరు. గత సంవత్సరం వరకూ తెలుగులోనే పాపులర్ అయిన ఈ స్టార్, ఒక తెలుగు సినిమా బాలీవుడ్‌లో సృష్టించిన సంచలనంతో బాహుబలి స్టార్ ప్రభాస్ అంటూ కొత్త బిరుదుతో ప్రపంచానికి పరిచయమయ్యారు ప్రభాస్. ఇక దీంతో పాటే ఆయనకు వరుసగా బాలీవుడ్ నుండి అవకాశాలు కూడా వస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఆఫర్ వస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు “బాహుబలి తర్వాత తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నా. అలా కాకుండా వేరే ఇతర భాషల నుంచి ఏవైనా ఇంటరెస్టివ్ ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తా” అన్నారు. ఈమధ్యే ‘ధూమ్ 4’ సినిమాకు కూడా ప్రభాస్ పేరును ప్రస్తావనకు తెచ్చారు. ఆయనకు దేశవ్యాప్తంగా తెచ్చిన క్రేజ్‌తోనే మహీంద్ర సంస్థ తమ కొత్త వాహనం టీయూవీ 300కు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఇక ఇదే విషయమై మాట్లాడుతూ, దీంతో బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ ఏవైనా వస్తే చేసేందుకు సిద్ధమన్న సూచన ప్రభాస్ వెలిబుచ్చడం విశేషంగా చెప్పుకోవచ్చు.

(Visited 74 times, 1 visits today)