Home / Entertainment / బాలయ్య ‘ డిక్టేటర్ ‘ డిసెంబర్ 20న భారీ ఎత్తున ఆడియో లాంచ్.

బాలయ్య ‘ డిక్టేటర్ ‘ డిసెంబర్ 20న భారీ ఎత్తున ఆడియో లాంచ్.

Author:

balakrishna dicator movie posters

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా ‘డిక్టేటర్’ లో నటిస్తున్నాడు, అంతకు ముందు వరుసగా సింహా, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో వరుస హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు డిక్టేటర్ సినిమాకు లౌఖ్యం వంటి సుపర్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్టర్. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కథని అందించారు. బాలయ్య ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేయడంతో బాలయ్య ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవలే ఢిల్లీలో ఓ మేజర్ పార్ట్ ని ఫినిష్ చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్ లో క్లైమాక్స్ పార్ట్ కి సంబందించిన యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తోంది. ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో బాలయ్య – ఫైటర్స్ పైన ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

ఆ తర్వాత మిగిలి ఉన్న రెండు పాటలని షూట్ చేస్తున్నాడు. అందులో ఒకటి స్పెషల్ సాంగ్, ఈ సాంగ్ లో బాలయ్యకి జోడీగా శ్రద్ధ దాస్ కనిపించనుంది. షూటింగ్ అప్ డేట్ ఇలా ఉంటే, డిసెంబర్ 20న భారీ ఎత్తున ‘డిక్టేటర్’ ఆడియో లాంచ్ చేస్తున్నట్టు ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఆ వేడుకకి సంబందించిన పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరో వైపు రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.

(Visited 68 times, 1 visits today)