Home / Entertainment / ఆ హీరోయిన్స్ నేను ఒక్క ఫోన్ చేస్తే ఒప్పుకుంటారు – బాలకృష్ణ

ఆ హీరోయిన్స్ నేను ఒక్క ఫోన్ చేస్తే ఒప్పుకుంటారు – బాలకృష్ణ

Author:

Dictator

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి అంజలి, సోనాల్ చౌహాన్హీరోహిన్స్.ఈ చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో సరదాగా బాలయ్య తన హీరోయిన్స్ గురించి సరదగా చెప్పుకొచ్చాడు. మాములుగా సినిమా పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్ సినిమా ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ అని, పాత్ర ప్రాధాన్యత అని రకరకాల విషయాలన్నీ పరిశీలించిన తర్వాతే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారు. అయితే బాలయ్య హీరోయిన్స్ మాత్రం అలా కాదని చెబుతున్నాడు. తను ఒక్క ఫోన్ చేస్తే ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నా సినిమాలో నటించడానికి ఒప్పుకునే హీరోయిన్స్ సినిమా పరిశ్రమలో ఇద్దరు ముగ్గురు ఉన్నారని బాలయ్య చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ అంజలి గురించి మాట్లాడుతూ ‘తను షూటింగ్ సమయంలో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందని, నటనలో మంచి టాలెంట్ ఉన్న అంజలి తెలుగు అమ్మాయి అవడం నిజంగా గొప్ప విషయమని తెలిపాడు. ఆ ఫోన్ చేస్తే వచ్చే జాబితాలో సోనాల్ చౌహాన్ కూడా ఉందని తెలిపాడు. లెజెండ్ చిత్రంలో తన అందంతో అలరించిన ఈ భామ ఇప్పుడు బాలయ్య ‘డిక్టేటర్’ చిత్రంలోను హీరోయిన్ గా నటిస్తుంది.‘డిక్టేటర్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

(Visited 113 times, 1 visits today)