Home / Entertainment / సావిత్రి కోసం వస్తున్న బాలయ్య.

సావిత్రి కోసం వస్తున్న బాలయ్య.

Author:

Balakrishna and Nara Rohit

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని సాదించింది. ఆ విజయానికి కారణం ఆ సినిమా దర్శకుడు పవన్ సాధినేని. ఒక కొత్త కాన్సెప్ట్ ను తోలి సినిమాతోనే డీల్ చేసిన ఘనత పవన్ కి దక్కింది. దానితో తన రెండవ ప్రయత్నంగా నారా రోహిత్, నందిని జంటగా ‘సావిత్రి’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో ఎంటర్టైనమెంట్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి చాలా అద్బుతంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకోస్తున్నాడు దర్శకుడు. సావిత్రి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోని మిగిలి ఉన్న సాంగ్స్ చిత్రికరిస్తున్నారు. ఈ సినిమా పాటలు మార్చి 4న గ్రాండ్ గా రిలీజ్ చేయానున్నారు. ఈ వేడుక మార్చి 4వ తేదీ సాయంత్రం జె.ఆర్.సి కన్వెన్షన్ హాల్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ చేతుల మీదుగా సావిత్రి ఆడియో లాంచ్ చేయనున్నారు. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై విబి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రన్ని మార్చి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

(Visited 65 times, 1 visits today)