Home / Entertainment / ఘనంగా ‘డిక్టేటర్’ పాటలు.

ఘనంగా ‘డిక్టేటర్’ పాటలు.

Author:

Dictator Movie Audio Launch at Amaravathi Photos

నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిక్టేటర్’. ఈరోస్ నిర్మాణ సంస్థ, వేధశ్వా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఘనంగా జరిగింది… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ఈ మొట్ట మొదటి సినీ వేడుకని అంగరంగ వైభవంగా జరిపి మరపురాని ఆడియో లాంచ్ గా మార్చారు.. ఈ వేడుకకి ఇరు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నందమూరి అభిమానులు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా ఆడియో వేడుకలో బాలకృష్ణ మొదటగా అన్నగారైన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొని, ఆ తర్వాత మంచి మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ తమన్ కి ప్రశంశలు అందించారు. అలాగే ఈ సినిమా బాగా రావడానికి కారణమైన శ్రీవాస్ అండ్ టీంని కూడా అభినందించారు. అలాగే అభిమానులే తన బలం అని వారి ఆదరాభిమానాలు ఇలానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకకి పలువురు టిడిపి నాయకులు కూడా హాజరయ్యారు.

(Visited 91 times, 1 visits today)