Home / Entertainment / “గుంటూరు టాకీస్” ట్రైలర్ విడుదల చేయనున్న బాలకృష్ణ.

“గుంటూరు టాకీస్” ట్రైలర్ విడుదల చేయనున్న బాలకృష్ణ.

Author:

దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభా ప్రదర్శనం చూపిస్తూ ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకుంటూ…‘చందమామ కథలు’తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఈయన డైరెక్షన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. గుంటూర్ స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల నిడివిగల టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ‘జబర్దస్త్’ ఫేం రేష్మి, యంగ్ హీరోయిన్ శ్రద్దాదాస్, నరేష్, సిద్ధూ, జొన్నలగడ్డ ప్రధానపాత్రలలో నటించారు. చిత్ర టీజర్ లో టూ ఇడియట్స్ గా నరేష్, సిద్ధులను పరిచయం చేశాడు. సిద్ధూ అమ్మాయిలను ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ పోషించగా, సిద్ధూతో అఫైర్ ఉన్న అమ్మాయిలుగా అందాలతో అలరిస్తున్నారు రేష్మి, శ్రద్ధాదాస్…

ఆర్.కే. స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ కుమార్ ఎం.నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు. మరో మూడు రోజుల్లో ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ ను ఫిభ్రవరి 3న నటసింహ నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేయానున్నాడు.

(Visited 154 times, 1 visits today)