Home / Entertainment / రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డు

రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డు

Author:

మహా గణనాథుల నిమజ్జనాలతో మన జంట నగరాలు ఒక పండుగ వాతావరణంలో ఉంది. మన హైదరాబాడ్ లో ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉందొ అలానే బాలాపూర్ లడ్డుకు అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి  సంవత్సరం బాలాపూర్ లడ్డుకు మరింత క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు లడ్డు ధర పెరుగుతూనే ఉంది. ఈ పవిత్రమైన లడ్డును దక్కించుకోవటానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు మండపానికి చేరుకొని ఎంతో భక్తి శ్రద్దలతో వేలంలో పాలుపంచుకుంటారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా బాలాపూర్ లడ్డు అధిక ధరలో పలికింది. ఎంతో మంది రాజకీయ, వ్యాపారుల మధ్య తీవ్రమైన పోటీ మధ్య పోయిన సారి కంటే  ఈ సారి ఎక్కువగా  14.65 లక్షలకు స్కైలాబ్ రెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా స్కైలాబ్ మాట్లాడుతూ…. నేను గత రెండు సంవత్సరాలుగా గణేశుడి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సంవత్సరం నాకు అదృష్టం దక్కింది. ఈ లడ్డును ప్రజలకు పంచిపెడుతా అని స్కైలాబ్ తెలిపాడు.

గత కొద్దీ సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డు ధర :
. 2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000
. 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000
.2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000
.2013లో తీగల క్రిష్ణా రెడ్డి -రూ. 9,26,000
.2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000
.2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000
. 2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000
. 2009లో సరిత -రూ.5,10,000
.2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000
.2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000
. 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000
. 2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000
. 2004లో కోలను మొహన్ రెడ్డి -రూ.2,01,000
.2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000
.2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000
. 2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000
. 2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000
.1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000
. 1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000
.1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000
.1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000
.1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500
.1994లో కొలను మోహన్ రెడ్డి – రూ. 450

(Visited 2,067 times, 1 visits today)