Home / Entertainment / బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి

Author:

బాలాపూర్: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి రికార్డు స్థాయిలో 29 మంది పాల్గొంటున్నారు. గతంలో వేలంలో పాల్గొన్నవాళ్లు 18 మంది పోటీ పడుతున్నారు. కొత్తగా మరో 11మంది పోటీలో నిలిచారు. లడ్డూ వేలంలో 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీని పూర్తిచేసుకుంటున్నాడు బాలాపూర్ గణనాథుడు.

గతేడాది వేలంలో నాగం తిరుపతి రెడ్డి లడ్డు వేలంలో పాల్గొని.. రూ.15 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈ ఏడాది భారీ ధర పలికింది. లడ్డూ దక్కించుకోవడానికి జరిగిన వేలంపాటలో బాలాపూర్‌కే చెందిన ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్‌ గుప్తా రికార్డు స్థాయిలో రూ.16.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఈ గణేశుడి లడ్డూ 15.60లక్షలు పలకగా.. ఈ సారి ఏకంగా లక్ష ఎక్కువ ధర పలకడం విశేషం.
బాలాపూర్‌ గణేశుడు ఈ రోజు ఉదయం మండపం నుంచి భారీ వాహనంలో బాలాపూర్‌ గ్రామ ప్రధాన కూడలికి చేరుకున్నాడు. అనంతరం గణేశ్‌ మండపం నిర్వాహకులు స్వామివారి లడ్డూకు వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ కమిటీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వేలంలో 12 మంది పాల్గొన్నారు.

Balapur Ganesh laddu smashes record, auctioned at Rs 16 lakh

లడ్డూ వేలం ప్రక్రియ పూర్తికావడంతో బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. నగరంలో ఎక్కువ దూరం జరిగే శోభాయాత్ర కావడంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, బేగంబజార్‌, అబిడ్స్‌ మీదుగా ఈ గణేశుడు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు.

(Visited 1 times, 1 visits today)