Home / Entertainment / బాలరాజు గా అఖిల్ ?

బాలరాజు గా అఖిల్ ?

Author:

అఖిల్ హీరోగా నటిస్తున్న తొలి సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న పేర్లు విని అక్కినేని ఫ్యాన్స్‌ షాక్ అవుతున్నారు. మొదటిగా ‘మిసైల్’ ఆతరువాత ‘తాండవం’ అనుకున్న తరువాత ఇప్పడు లేటెస్ట్ గా ‘బాలరాజు’ టైటిల్ వైపు మొగ్గు చూపెడుతున్నట్లు వార్తలు రావడం అఖిల్ అభిమానులకు షాకింగ్ గా మారింది.నిర్మాత నితిన్ ఈసినిమాను దసరా కానుకగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈసినిమా టైటిల్ నిర్ణయ విషయంలో కథ క్లైమాక్స్ కు చేరింది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాకు అక్కినేని సూపర్ హిట్ మూవీ ‘బాలరాజు’ టైటిల్ పరిశీలిస్తున్నారని విశ్వసనీయ వార్త. సెప్టెంబర్‌లో యూరప్, హైదరాబాద్‌ల్లో 3 పాటలు చిత్రీకరణ చేస్తే టోటల్ షూటింగ్ పూర్తి అవుతుంది కాబట్టి ఈసినిమా హంగామా మొదలవనుంది.ఈనెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పబ్లిసిటీ మొదలు పెట్టాలని, సెప్టెంబర్ 20న స్వర్గీయ అక్కినేని జయంతి రోజున ఈ మూవీ ఆడియో వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నాగార్జున ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇద్దరు సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న ఈసినిమాకు మణి శర్మ కూడ కలవడంతో ముగ్గురు సంగీత దర్శకులు ఈసినిమాకు పనిచేస్తున్నట్లు అవుతోంది. అయితే అఖిల్ మొదటి సినిమా కావడం అదీకాకుండా ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యం మధ్య ఇలాంటి టైటిల్స్ కంగారు కామనే అని..రైట్ టైం లొ రైట్ టైటిల్ తో అఖిల్ ఇరగదీస్తాడని ఫాన్స్ హోప్..

(Visited 18 times, 1 visits today)