Home / Inspiring Stories / నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మొదలు..!

నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మొదలు..!

Author:

హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేవి చార్మినార్, గోల్కొండ, ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ… బల్కంపేట ఎల్లమ్మ భాగ్యనగర వాసుల ఇలవేల్పు.  ప్రతి ఆదివారం అక్కడ జాతర సాగుతుంది. అంబానీ కుటుంబం కూడా వచ్చి దర్శించుకుంటారు మన ఎల్లమ్మ తల్లిని అది మరి బల్కంపేట ఎల్లమ్మ అంటే…

Balkampet-Yellamma-Temple-in-Hyderabad

బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం చేసే కళ్యాణ మహోత్సవం ఈ రోజు నుండి మొదలుకానుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలనుండి చాలా మంది భక్తులు వస్తారని అంచనా. ప్రభుత్వ అంచనా ప్రకారం 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముందుగా గణపతి పూజతో మొదలు కానున్న ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ తర్వాత అమ్మవారి విశిష్ట పూజ కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7 గంటలకు బల్కంపేటలోని శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నుంచి ఎదుర్కోలు ఉంటాయి.

ఇక 5వ తేదీన అనగా మంగళవారం ఉదయం 11 గంటలకు నక్షత్రయుక్త శుభలగ్న సుముహూర్తమున శ్రీ ఎల్లమ్మ అమ్మవారి  కళ్యాణం అంగరంగా వైభవంగా జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి వద్ద ఉండే లడ్డూ బహిరంగ వేలం వేయడం జరుగుతుంది. దానితో మంగళవారం కార్యక్రమాలు జరిగినట్టే. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి కళ్యాణ మహోత్సవం చివరి ఘట్టంగా రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవం బల్కంపేట విధులలో ఊరేగిస్తారు. ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ప్రభుత్వం అన్ని రకాల తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అలాగే పటిష్టమైన భద్ర విభాగాలు కూడా ఈ కాళ్యాణ మహోత్సవం కోసం పనిచేస్తున్నాయి.

(Visited 257 times, 1 visits today)