Home / Political / బ్లేడుతో కోసుకోండి అన్నందుకు…కేసీఆర్ పై బండ్ల గణేష్ రివర్స్ పంచ్!!! దెబ్బకి అందరు సైలెంట్!!

బ్లేడుతో కోసుకోండి అన్నందుకు…కేసీఆర్ పై బండ్ల గణేష్ రివర్స్ పంచ్!!! దెబ్బకి అందరు సైలెంట్!!

Author:

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఎంత ఓవర్ చేసారో కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. సోషల్ మీడియాలో ఆ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి పెద్ద బొక్క పడింది. కేసీఆర్ దెబ్బకి సరిగ్గా ఇరవై సీట్లు కూడా దక్కలేదు. మరి ఇప్పుడు బండ్ల గణేష్ ఏమయ్యారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వస్తున్నాయి. కొందరైతే బ్లేడ్ తీస్కొని బండ్ల గణేష్ ఇంటికి కూడా వెళ్లారు.

కానీ బండ్ల గణేష్ మాత్రం అప్పటి నుండి అడ్రస్ లేడు. ‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు’’ అని ట్వీట్ మాత్రం చేసారు.ఇప్పుడు నిదానంగా మీడియా ముందుకొచ్చిన బండ్ల గణేష్ కేసీఆర్ పై షాకింగ్ కామెంట్ చేశారు.

2013లో తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్.. దళితున్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతా.. మాటతప్పితే తల నరుక్కుంటా అన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దలిత సీఎం లేరు. కేసీఆర్ తల నరుక్కోలేదు.ముఖ్యమంత్రి సీట్లో దళితునికి బదులు తానే కూర్చొని సరదాగా కాలం గడిపారు. తల తలలాగే ఉంది.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆ పెద్ద మనిషే మాట తప్పితే పట్టించుకోని మీరంతా.. నన్నెందుకు పట్టించుకుంటున్నారు?

ఇంత అత్యుత్సాహం చూపించే మీడియా వాళ్ళు…కేసీఆర్ ని తలనరుక్కోమని ఎందుకు అనట్లేదు అంటూ రివర్స్ పంచ్ వేశారు. దీంతో ఇది చూసిన జనానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.

(Visited 1 times, 1 visits today)