Home / Inspiring Stories / చదువులు నాశనం అవుతున్నాయని ప్రతిరోజు అర్ధరాత్రి ఫేస్ బుక్ బంద్.

చదువులు నాశనం అవుతున్నాయని ప్రతిరోజు అర్ధరాత్రి ఫేస్ బుక్ బంద్.

Author:

చేయాల్సిన పని మానేసి పొద్దస్తమానం ఫేస్ బుక్ తో సమయం వృధా చేసే వారు కోకొల్లలు. రోజు రోజు కి సోషల్ మీడీయా మన జీవితాల్లో భాగమై మన సమయాన్నే శాసించే రేంజ్ కి చేరింది. స్కూలు , కాలేజీ, బెడ్ రూము, బాత్ రూము ఇలా ఏ ప్లేస్ లో అయిన యువత చేతిలో ఫోన్ పట్టుకుని అందులో ఫేస్ బుక్ చూస్తూ తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. దీనివలన వారి చదువులు పాడు అవుతున్నాయని భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు రాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు ఫేస్ బుక్ పని చేయకుండా నిషేదించాలంటూ బంగ్లాదేశ్ టెలీకమ్యునికేషన్ రెగ్యులేటరీ కమిషన్(BRTC)ను కోరింది. దీనిపై స్పందించిన కమిషన్, ఫేస్ బుక్ వారిని సంప్రదించి ఈ నిషేదం అమలు చేసే మార్గం అలోచిస్తామని ప్రకటించింది.

facebook ban in bangladesh

ఈ నిర్ణయం ఈ రోజే ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదని చెప్పిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఫేస్ బుక్ ని బ్యాన్ చేయలంటూ వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు తమకు ఉత్తరాలు రాసారని తెలిపింది. దేశంలో విద్యా ప్రమాణాలు పడిపోతుండడం మరియు పరీక్షలల్లో విద్యార్దులకు తక్కువ మార్కులు వస్తుండడం వంటి విషయాలు పరిగణలోకి తీసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి కనీసం రాత్రి పూట అయినా ఫేస్ బుక్ ని బ్యాన్ చేయాలని అదేశాలు జారి చేసింది. దీనిపై ఫేస్ బుక్ వారి మరియు విద్యార్దుల స్పందన ఏలా ఉంటుందో?

(Visited 4,005 times, 1 visits today)