Home / Political / వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్.

వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్.

Author:

500, 1000 నోట్లు రద్దై నెల దాటినా సామాన్య ప్రజల కరెన్సీ కష్టాలు తీరలేదు. అసలే డిసెంబర్ మొదటి వారంలో బాకీలు ఎలా తీర్చాలో తెలియక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త. ఈ శనివారం నుండి సోమవారం వరకు బ్యాంకులు బంద్ కానున్నాయి. పెద్ద నోట్ల కష్టాలతో రోడ్డెక్కిన సామాన్య ప్రజానీకం ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అసలే డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఇక వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో అందరిని మనీ కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. ఈ శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఇక ఆదివారం ఎలాగు అందరికి సెలవు. వచ్చే సోమవారం 12 న మిలాదినబి కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు.

banks-holidays

ఇప్పటికీ ఎటిఎంలు సరిగా పనిచేయని పరిస్థితి. 90% పైగా ఎటిఎంలు పనిచేస్తున్నాయి అని కేంద్రం చెబుతున్న మాట ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఇక మూడు రోజులు వరుసగా బ్యాంకులు మూసి ఉండి ఏటీఎంలు తెరువక ప్రజలు రోడ్ మీదకు వచ్చే పరిస్థితి కనబడంటం లేదు. మరో వైపు కేంద్రం కరెన్సీ పై రోజుకో ప్రకటన చేస్తుండటం ప్రజలను మరిన్ని ఇబ్బదులకు గురి చేస్తుంది.  దీనితో ఈ గురు, శుక్రవారాల్లో అన్ని బ్యాంకులలో రద్దీ పెరిగే సూచనలు చాలా ఉన్నాయి.

(Visited 10,859 times, 1 visits today)