Home / Inspiring Stories / ఆత్మవిశ్వాసంతో విరబూసిన బసంతీ

ఆత్మవిశ్వాసంతో విరబూసిన బసంతీ

Author:

Basanti Kumari

“మీరేదైనా సాధించాలి అనుకుంటే పెద్దగా ఏమీ కావాల్సిన అవసరం లేదు, కోరుకున్న దాన్ని సాధించాలనే తీవ్రమైన కోరికా దాన్ని సాధించటానికి కావలసిన తపనా ఉంటే చాలు” ఈ మాటలు చెప్పింది ఏ ఎవరెస్టు అధిరోహించిన మనిషో,లేదంటే ప్రపంచ స్థాయి కప్పు సాధించిన ఆటగాడో కాదు ఒక సామాన్య సోషియాలజీ లో డిగ్రీ పూర్తి చేసి న ఒక స్కూల్ లో టీచర్. దీన్లో గొప్పేముందీ ఆమె సాధించింది మమూలుడిగ్రీ నే కదా అనిపించవచ్చు విశయం ఏమితంటే ఈ టీచర్ కి తెండు చేతులూ లేవు.ఔను..! ఆమె కి పుట్టుకతోనే రెండు చేతులూ లేవు.

జార్ఖండ్ కి చెందిన 30 ఏళ్ల బసంతీ కుమారి కి జన్యు లోపం కారణంగా రెండు చేతులు భుజాలని దాటి ఎదగలేదు. ఆమెతండ్రి ఎఫ్సీఐ లో రోజు వారీ కూలీ. బసంతీ పుట్టినప్పుడు ఆమెని చూసిన తల్లితండ్రులే కాదు ఆసుపత్రి వైధ్యులు కూడా ఆమె భవిశ్యత్తు గురించి బాదపడ్డారట. బసంతి తర్వాత పుట్టిన నలుగురు సంతానమూ మామూలుగానే ఉన్నరు. తన తోబుట్టువులు స్కూల్ కి వెళ్ళటం చూసి తానూ చదువుకుంటానని బసంతి ఏడ్చినప్పుడు ఆమె తల్లి ఎలా? అని ఆలోచించలేదు తన కూతురికి కావలసిందేమిటో దానికోసం ఏం చేయాలో ఆమెకి కి బాగాతెలుసు. కూతురి చదువుకి తాను అండగా నిలబడింది కాళివేళ్ళతో రాయటం లో బసంతికి ఎంతో సహకరిస్తూ నెమ్మదిగా శిక్షణ ఇవ్వటం ప్రారంబించింది. చదువు నెమ్మదిగా మొదలై సింద్రి పట్తనం లోని కాలేజ్ నుంచి బీయ్యే సోషియాలజీ లో పట్టా తీసుకుంది.సింద్రిలోనే ఉన్న హతియామోర్ ధోంగడ్ లో ఒక స్కూల్ లో పారా టీచర్ గా చేరింది. కాళి వేళ్ళతోనే ఆమె ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు రాస్తుంది, పిల్లలకు గణితం బోదిస్తుంది, వారికి నోట్స్ రాసిస్తుంది….

Basanthi Kumari
తనకి వచ్చే నెలజీతం తోనే ఇప్పుడు బసంతీ తన కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి సింగ్ కి పక్షవాతం రావటం తో కుటుంబబారాన్ని ఆమే మోయవలసి వస్తున్నా బసంతి లో నిరాశ లేదు, తాను కష్టాలలో ఉన్నాను అనే ఆలోచనలేదు. ఇప్పుడు ఆమె బాదంతా ఒకటే పారా టీచర్లని తీసేస్తున్నారు అనే ప్రభుత్వ ప్రకటన ఒకటే ఆమెను కొద్దిగా కలవర పెడుతోంది. తన ఉద్యోగం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తోంది.. అయినా కూడా “ఇప్పటివరకూ నేను బతక గలిగానూ అంటే కేవలం సాధించగలను అన్న నమ్మకం తోన్రే కదా..! ఇప్పుడూ అదే నమ్మకం నన్ను నడిపిస్తుంది” అంటూన్న బసంతీ మనలో ఎంతో మందికన్నా ఎన్నో సాధిన గొప్ప గొప్ప మనుషులకన్నా గొప్పదేమో… అందుకే బసంతీ మాటలకు అంత విలువ…

(Visited 125 times, 1 visits today)