అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు వస్తున్న అక్కినేని అఖిల్ తన సొంత పేరుతోనే వస్తున్న విషయం తెలిసిందే. ‘అఖిల్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరో నితిన్ ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే భారీ అంచనాలతో క్రేజీ సినిమాగా నిలిచిన ‘అఖిల్’, ఈమధ్యే విడుదలైన టీజర్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది. బాలీవుడ్ హీరోలకి ధీటుగా తన చార్మింగ్ లుక్ తో అందర్నీ ఆకట్టు కున్నాడు ఈ అక్కినేని యువ హీరో. పోస్టర్లోనూ, టీజర్ లోనూ అక్కినేని వారసుడిని చూసిన వారంతా మరో స్టార్ రాబోతున్నాడంటూ కితాబిచ్చేసారు. ఇప్పటికే బిజినెస్ పరంగా దూసుకెల్తున్నాడు అఖిల్. ఇప్పటికే బండ్ల గణేష్ అఖిల్ రెండో సినిమా తనే నిర్మించాలనే ప్రయత్నాల్లోనే ఉన్నాడట. ఇప్పటికే అఖిల్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేసాడూ అని సమాచారం. డైరెక్టర్ కూడా శ్రీమంతుడు సినిమాతో సక్సెస్ లో ఉన్న కొరటాల శివ అయుండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనీ,ఇప్పటికి ఏర్పడిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించాలనుకోవటం లేదట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఇక తాజాగా రెండు పాటల కోసం ఈ సినిమా యూనిట్ ఓ ఫారిన్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ పాటలు సినిమాకే హైలేట్ గా ఉండాలని సీరియస్ వర్క్ లో కి దిగారట “అఖిల్” చిత్ర బృందం. ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుందని అఖిల్ ఈ సందర్భంగా తెలుపుతూ, షూటింగ్ లొకేషన్స్‌లో దిగిన ఫోటోలు కొన్నింటిని అభిమానులతో పంచుకున్నారు. ఈ లేటెస్ట్ ఫొటోలే ఇంటర్నెట్ లో ఇప్పుడు హాటెస్ట్ చర్చ ఇప్పుడు. అక్టోబర్ 21న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.