Home / Entertainment / ఘనంగా ‘స్పీడున్నోడు’ పాటల వేడుక

ఘనంగా ‘స్పీడున్నోడు’ పాటల వేడుక

Author:

Speedunnodu Trailer

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత నటించిన సినిమా ‘స్పీడున్నోడు’ చిత్రం యొక్క ఆడియో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తమిళ చిత్రం సుందరపడియాన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ స్పీడున్నోడు చిత్రానికి భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని సునీత, రోశితసాయి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్ర ఆడియో వేడుకకి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యి స్పీడున్నోడు చిత్ర ట్రైలర్ ను ఆడియో వేడుకలో విడుదల చేసారు. అనంతరం వినాయక్ మాట్లాడుతు.. వినాయక్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ శ్రీనివాస్ నటనని ప్రశంసించాడు.

తమన్నా మాట్లాడుతూ… శ్రీనివాస్ మొదటి సినిమాతో పాటు రెండవ సినిమాలోనూ నటనతో పాటు డాన్సులు, ఫైట్స్ లతో అలరించబోతున్నాడని ఈ చిత్రంలో తను ఐటెం సాంగ్ చేయడం సంతోషంగా ఉన్నట్లు తమన్నా తెలిపింది.

భీమినేని శ్రీనివాస్ రావు మాట్లాడుతు… ఫ్రెండ్‌షిప్ గొప్పదనాన్ని చెప్పే కథతో ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చూపించామని . శ్రీనివాస్ ఈ సినిమాలో డాన్సులు, ఫైట్లు సన్నివేశాలలో గొప్పగా నటించాడు అని తెలియజేశాడు. ఈ ఆడియో వేడుకకి రెజినా, కేథరిన్, పూర్ణ, రకుల్ ప్రీత్ సింగ్, హేభ పటేల్ పలువురు భామలు హాజరై సందడి చేసారు.

(Visited 118 times, 1 visits today)