Home / Entertainment / ‘స్పీడున్నోడు’ ప్రీ రిలీజ్ బిజినెస్ లో స్పీడుగా దూసుకుపోతున్నాడు.

‘స్పీడున్నోడు’ ప్రీ రిలీజ్ బిజినెస్ లో స్పీడుగా దూసుకుపోతున్నాడు.

Author:

Speedunnodu Movie

బెల్లంకొండ శ్రీనివాస్ భిమేనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ గా వస్తున్నాడు. శ్రీనివాస్ సరసన సోనారిక బడోరియా హీరోయిన్ గా నటించింది. స్పీడున్నోడు చితం ‘సుందర పాండ్యన్’ అనే తమిళ చిత్రానికి రీమేక్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రనికి డి.జె.వసంత్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబందించిన బిజినెస్ క్లోజ్ అయ్యిందట. ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ స్టార్ హీరోగా ఇండస్ట్రిలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది.

(Visited 104 times, 1 visits today)